Total 84.3 per cent population was administered first dose of Covid vaccine in Telangana: తెలంగాణలో 38.5 శాతం మందికి రెండు డోసుల కరోనా టీకా వేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ టి.హరీశ్​రావు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర వ్యాప్తంగా 84.3 శాతం (Corona vaccination in Telangana) మందికి మొదటి డోసు పూర్తయినట్లు తెలిపారు. బుధవారం వ్యాక్సినేషన్​ ప్రక్రియ ముగిసే నాటికి ఈ గణాంకాలకు నమోదైనట్లు వెల్లడించారు.


ఇటీవలే ఆరోగ్య శాఖ బాధ్యతలను (ప్రస్తుత శాఖకు అదనంగా) స్వీకరించిన హరీశ్​ రావు వైద్య శాఖ ఉన్నతాధికారులతో (Health minister Harish Rao) సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే టీకా గణాంకాలను వెల్లడించారు.


Also read: Sajjanar : ప్రయాణికుడి ట్వీట్‌తో బస్‌ చార్జీలు తగ్గించిన సజ్జనార్‌


ఇక దేశవ్యాప్తంగా చూస్తే.. 37.5 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని (Corona vaccination in India).. 79 శాతం మంది ఒక డోసు మాత్రమే తీసుకున్నారని వివరించారు. ఈ లెక్క ప్రకారం వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటుకన్నా.. రాష్ట్ర సగటే ఎక్కువని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీకా ప్రక్రియ వేగంగా ఇంకా పెంచాలని అధికారులకు సూచించారు.


Also read: Covaxin: కొవాగ్జిన్​ తీసుకున్న వారికి విదేశీ ప్రయాణాలు ఈజీ- టీకా సామర్థ్యం 77.8 శాతం!


Also read: Kangana Ranaut: 'దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చింది' కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు


నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..


ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తొలిసారి నిర్వహించిన ఈ ఉన్నతస్థాయి సమీక్షలో... కరోనా పరిస్థితుల, వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. వాటి నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు హరీశ్​ రావు.


దీనితో పాటు.. కింగ్​కోఠి ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో 350 పడకలు సాధారణ సేవలకు అందుబాటులోకి రానున్నాయి.


టిమ్స్​ సిబ్బంది, ఆస్పత్రి బకాయిల చెల్లింపునకు, టిమ్స్​లో కొవిడ్ బడ్స్​ మినహా.. మిగతా వాటిలో సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.


వ్యాక్సినేషన్‌పై రేపు (నవంబర్ 13 శనివారం) అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి హరీశ్​రావు.


Also read: Drug seizure : హైదరాబాద్‌లో రూ.5.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత


Also read: Williams‌ case : నిత్య పెళ్లికొడుకు విలియమ్స్‌ కేసులో మరో ట్విస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook