Telangana Government: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు వమ్ముచేసి కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలో వచ్చింది. 64 సీట్లు గెల్చుకుని రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈలోగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

119 నియోజకవర్గాల తెలంగాణ అసెంబ్లీకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెల్చుకోగా మిత్రపక్షం సీపీఐ 1 స్థానం కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితం కాగా బీజేపీ 8 స్థానాల్ని, ఎంఐఎం 7 స్థానాల్ని గెల్చుకున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినా సరే మూడ్రోజుల వరకూ కాంగ్రెస్ పార్టీకు సీఎం పంచాయితీ తెగలేదు. చివరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరుల అసంతృప్తుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే బుజ్జగించగలిగింది. 


అందుకే ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగగలుగుతుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులు ఎల్లకాలం సంతృప్తిగా ఉండటం కష్టమే. ఈ అసంతృప్తులు ఎల్లకాలం కొనసాగలేకపోతే పరిస్థితి ఏంటనేదే అసలు ప్రశ్న. ఎందుకంటే మేజిక్ ఫిగర్ కంటే కాంగ్రెస్ పార్టీకు అధికంగా ఉన్నది ఐదు స్థానాలే. అసంతృప్తులు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే  కడియం శ్రీహరి, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 


ఆరు నెలలో, ఏడాది లేదా రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎంగా అధికారం చేపడతారనేది కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్య.ఈ వ్యాఖ్యల నేపధ్యంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమౌతుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత మౌనంగా కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిపోవడం, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకు 3 నెలల సమయమిస్తున్నామని చెప్పడం ఏదో జరగవచ్చనే అనుమానాల్ని కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. 


అదే సమయంలో బీజేపీకు చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే పడిపోతుందని బీజేపీ ప్రభుతత్వం వస్తుందనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఈ ఇద్దరి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొద్దికాలం నిరీక్షించి పార్టీలోని అసంతృప్తుల్ని తమవైపు లాక్కుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓ విఫల ప్రభుత్వంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం జరగనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


Also read: Telangana CM Oath: రేపు రేవంత్ కాకుండా మరో ఆరుగురికే ఛాన్స్, , అసెంబ్లీ తరువాతే పూర్తి స్థాయి కేబినెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook