ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్టయ్యారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హైదరాబాద్ బోయిన్‌పల్లి ( Boinpally )లో జరిగిన కిడ్నాప్ ఘటన ( Kidnap case ) కలకలం సృష్టించింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భర్త భార్గవ్ రామ్‌లను హైదరాబాద్ పోలీసులు ( Hyderabad Police ) అరెస్టు చేశారు. డిసెంబర్ 5 అర్ధరాత్రి ముఖ్యమంత్రి దగ్గరి బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఐటీ అధికార్లమంటూ ఇంటికొచ్చి..మాటల సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవ్‌ల పేర్లు ప్రస్తావించారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ముగ్గుర్నీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమేరాల ద్వారా డైమండ్ పాయింట్ రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాల్ని గుర్తించి..పట్టుకున్నారు. 


ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ( Ap ex minister Bhuma Akhila priya )ని పోలీసులు అరెస్టు చేశారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ ( Boinpally Police Station )‌కు తరలించి విచారణ చేస్తున్నారు. కిడ్నాప్ కేసులో నిందితుల్ని అరెస్టు చేశామని..పూర్తి విచారణ కొనసాగుతుందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బాధితులు ఎవరిపై అయితే అనుమానం వ్యక్తం చేశారో..వారిని అదుపులో తీసుకున్నామని చెప్పారు. అటు కిడ్నాప్‌కు గురైన ముగ్గురిని సురక్షితంగా కాపాడామన్నారు.


Also read: Heera Gold Case: డబ్బులు ఎలా చెల్లిస్తారో స్ఫష్టం చేయాలి: సుప్రీంకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook