హైదరాబాద్‌ని మంచు దుప్పటి కప్పేస్తోంది. సీతాకాలంలోకి ప్రవేశించడంతో రాత్రి వేళల్లో రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు చలితీవ్రతను అధికం చేస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలోనే ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవగా.. రానున్న నవంబర్‌ మొదటివారం నుంచి మరింత తీవ్రమైన చల్లటిగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏరోజుకారోజు రాత్రి వేళల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో క్రమక్రమంగా తెల్లవారిజాము వేళ్లలో మంచు సైతం తొలగడంలేదు. నిన్న మంగళవారం నగరంలో గరిష్ఠంగా 31.9 డిగ్రీలు, కనిష్ఠం 16.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


ముఖ్యంగా అటవీ ప్రాంతం, చెట్లు అధికంగా ఉండే శివారు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో ఆయా ప్రాంతాలవాసులని చలి మరింత వణికిస్తోంది.