TS SSC Student Complaint on Bandi Sanjay: పెద్దపల్లి జిల్లా : పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ఎ1 గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ పై పెద్దపల్లి జిల్లాలో పోలీసులకు మరో రెండు ఫిర్యాదులు అందాయి. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ వివాదంలో బండి సంజయ్ నే ఏ1 పేర్కొంటూ ఆయన్ని కోర్టులో హాజరుపర్చిన తరువాత ఒకట్రెండు గంటల వ్యవధిలోనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో పదో తరగతి విద్యార్థులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. పదవ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ చేసి తమ జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ విద్యార్థులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కి హన్మకొండ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వరంగల్ పోలీసులు అత్యంత బందోబస్తు మధ్య బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్‌ని వరంగల్‌లో కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో, కోర్టు నుంచి జైలుకు తరలించే సమయంలో బీజేపి నేతలు, కార్యకర్తలు, మద్దతుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన కనిపించింది. 


ఇది కూడా చదవండి : Bandi Sanjay Arrest Live Updates: బండి సంజయ్ ఫోన్‌లో కీలక విషయాలు.. పేపర్ లీకేజీ అంతా ఓ గేమ్‌ప్లాన్‌: సీపీ


బండి సంజయ్ ని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పలు విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత సైతం కనిపించింది. బండి సంజయ్‌కి వ్యతిరేక నినాదాలు చేసిన ఆందోళనకారులు.. పేపర్ లీక్ కి పాల్పడిన బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.


ఇది కూడా చదవండి : Bandi Sanjay Arrested: బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మల రామారం పీఎస్‌కి తరలింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter Facebook