Terrorists Training at Ananthagiri Hills: భాగ్య నగరంలో ఉగ్రవాదుల కలకలం.. భయపడిపోతున్న నగర వాసులు... బయటపడిన ఉగ్రవాదుల లింకులు... లింకుల్లో ఆరుగురు అరెస్ట్... ఉగ్రవాదులు వేసిన స్కేచ్ ఏంటీ.. వేసిన ప్లానింగ్ అమలు చేసేందుకు ఎవరు రంగంలోకి దిగబోతున్నారు... నగరంలో ఏం జరగబోతుంది... ఉగ్రవాదులు ఏం మారణహోమం సృష్టించబోతున్నారు... ఇంకా కొనసాగుతున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ఏం చెబుతోంది ?  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగ్ర కుట్రలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. విచారణలో భూపాల్ టు హైదరాబాద్‌కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు బయటపడింది.. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు  దర్యాప్తులో వెల్లడైంది. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా సంప్రదింపులు జరిపారు. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడ్డారు. ఉగ్రవాదులు షెల్టర్‌ జోన్‌గా హైదరాబాద్‌ ను ఎంచుకున్నారు. కార్యాకలాపాలు కొనసాగించేందుకు ప్లాన్ వేశారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు... కేంద్ర ఇంటలిజెన్స్ సాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించి 17మందిని అదుపులోకి తీసుకున్నారు. 


నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ ని సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్టైన ఆరుగురు, భూపాల్ లో అదుపులోకి 11 మందిని ఏటీఎస్ అధికారులు కోర్టులో హాజరు పర్చారు. వాళ్లకు భూపాల్ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 20  వరకు కస్టడీ విధించింది.


ఉగ్ర కుట్ర కోణంలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. అనంతగిరి కొండల్లోనే ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారు. తుపాకులు పేల్చడం.. కత్తులు, గొడ్డళ్లలతో దాడి చేయడంలో ఆరి తేరారు. ఉగ్రవాదులు తయారుచేసిన యూట్యూబ్ ఛానెల్లో చూసి విపరీతమైన నాల్జెడ్ పెంచుకున్నారు. నగర ప్రధాన ప్రాంతాల్లోని హోటళ్లు, గెస్ట్ హౌస్ లు, ప్రభుత్వాఫీసుల్లో దాడులకు ప్లానింగ్ వేశారు. మూకుమ్మడి దాడి చేసి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడానికి ప్లాన్ చేశారు. మాల్ప్ పై దాడి చేసి తమ ఆధీనంలోకి ఉంచుకోవడానికి కుట్ర చేశారు. ప్రజలను తమ ఆధీనంలో పెట్టుకుని భయందోళనలకు గురిచేయాలని చూశారు. 48 గంటల పాటు ఎలాంటి ఆహరం తీసుకోకుండా ఉండేందుకు శిక్షణ తీసుకున్నారు. హైదరాబాద్, భోపాల్ లో డ్రోన్ ద్వారా రెక్కి నిర్వహించారు. అంతేకాకుండా భారీగా మత మార్పిళ్లను ప్రోత్సహించి యువతను హిజ్బుత్ తహ్రీక్ ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు ఈ గ్యాంగ్ పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 


అరెస్ట్ అయిన ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు దేశంలో భారీ విధ్వంసానికి పథక రచన చేసినట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో ఇంకా ఈ ముఠాలో ఎంతమంది సభ్యలు ఉన్నారనే దానిపై అరెస్టయిన వారి నుంచి భోపాల్ ఏటీఎస్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉగ్రవాద లింకులు దేశంలో అన్ని రాష్ట్రాలకు వ్యాపించాయి అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. భోపాల్‌లో కీలక నిందితుడు యాసిర్, హైదరాబాద్ లో కీలక నిందితుడు సలీమ్ గా పోలీసులు గుర్తించారు. నగరంలో ఇంకైమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఐఏ కూడా రంగంలో దిగనుంది. నిందితుల లింకులపై కూపీ లాగుతోంది. ఇటు ఏటీఎస్ పోలీసులు... అటు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది.