Group 1 Mains Free Training: నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిల్‌ అద్భుతమైన శుభవార్త వినిపించింది. మీరు గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు అర్హత సాధించి ఉంటే చాలు. అత్యంత సులభంగా గ్రూప్‌ 1 అధికారి అనే కలను సాకారం చేయడానికి స్టడీ సర్కిల్‌ మంచి అవకాశం కల్పిస్తోంది. ఉచితంగా శిక్షణ కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్‌.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన


గ్రూప్-1 మెయిన్స్‌ ప‌రీక్ష‌కు ఉచిత‌ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలంగాణ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఉపాధి క‌ల్ప‌న‌, నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు టీజీబీసీఈఎస్‌డీటీసీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డి మంగళవారం ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ చికిత్స కోసం 75 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపింది. ఈ నెల 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించింది.


Also Read: DSC Aspirants: తెలంగాణ నిరుద్యోగులు సంచలనం.. డీఎస్సీ వాయిదాకు అర్ధరాత్రి ఉద్యమం


 


మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఉచితంగా శిక్ష‌ణ పొందాల‌నుకుంటే తమ దరఖాస్తును www.tgbcstudycircle.cgg.gov.in లో స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల కుటుంబ ఆదాయం వార్షికాదాయం రూ.5 ల‌క్షలలోపు ఉండాలని సూచించింది. రోల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం ఉచిత శిక్ష‌ణ‌కు అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంది. ఎంపికైన వారికి శిక్ష‌ణ కాలంలో నెల‌కు రూ.5 వేల ఉప‌కార వేత‌నం (బుక్ ఫండ్‌, ర‌వాణా స‌హ‌) అందిస్తామని వివరించింది. ఉచిత శిక్ష‌ణను హైదరాబాద్‌, ఖమ్మంలోని రెండు కేంద్రాల్లో అందిస్తామని సంస్థ ప్రకటించింది. మరింత సమాచారం కోసం ఫోన్ నెంబర్ 040-24071188లో సంప్రదించవచ్చని సూచించింది.


ఉచిత శిక్షణ కేంద్రాలు 
హైద‌రాబాద్:
సైదాబాద్‌లోని టీజీ బీసీ స్ట‌డీ స‌ర్కిల్, రోడ్ నెం-8, ల‌క్ష్మీన‌గ‌ర్‌
ఖ‌మ్మం: టీజీ బీసీ స్ట‌డీ స‌ర్కిల్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter