అసదుద్దీన్‌కు ధీటైన అభ్యర్ధిని రంగంలోకి దించుతున్న బీజేపీ
అసదుద్దీన్ ఓవైసీ.. హైదరాబాద్ లో తిరుగులేని నాయకుడు. హైదరాబాద్ ఎంపీగా వరుసగా నాలుగు పర్యాయాలు గెలిచిన ఏకైక నేత. అలాంటి బలమైన నేతను ఎదుర్కొనేందుకు బీజేపీ ఇప్పటి నుంచే భారీ ఎత్తున కరసత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఆయనకు గట్టి పోటీ ఇచ్చే నేతను గుర్తించినట్లు తెలిసింది. అసదుద్దీన్‌కు ఎదురొడ్డి నిలబడి పోటీ చేసే అభ్యర్ధి ఎవరనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే....
రాజా ది గ్రేట్...
హైదరాబాద్ లో నాల్గు పర్యాయాల నుంచి గెలుస్తూ వస్తున్న అసదుద్దీన్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదువుతోంది. ముస్లిం ఓట్లే ప్రధాన ఆయుధంగా గెలుస్తూ వస్తున్న ఓవైసీ ఎదుర్కొకునేందుకు.. కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్రపడ్డ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
అసద్ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్
ప్రధాని మోడీ , అమిత్ షా... ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా హైదరాబాద్ లో పోటీ చేసి గెలవాలని అసదుద్దీన్ ఇటీవలే బీజేపీకి బస్తీమే సవాల్ విసిరారు. అసద్ మాటలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ ..దీని కోసం భారీగానే కసరత్తు చేసింది. ఓట్లు చీలకుండా పూర్తి స్థాయిలో హిందుత్వ ఓట్లను సాధించినట్లయితే అసదుద్దీన్ ను ఓడించడం పెద్ద కష్టం కాబోదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ వెంకయ్యనాయుడు, బాలిరెడ్డి వంటి బలమైన నేతలు ఈ స్థానంలో బరిలోకి దిగి కొద్ది పాటి తేడాతో ఓడిపోయారు. అప్పటి పరిస్థితుల కంటే.. ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి కాస్త అనుకూలంగా ఉన్నాయి.. సరైన వ్యూహంతో బరిలోకి దిగితే ఈ స్థానాన్ని దక్కించుకోవడం పెద్ద కష్టం కాబోదని బీజేపీ భావిస్తోంది
విమర్శలే రాజాకు అనుకూలించాయి..
అసద్ పై గట్టి అభ్యర్ధి కోసం వెతుకుతున్న తరుణంలో ఓవైసీని పనిగట్టుకొని మరి విమర్శలు చేసే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కనిపించారు. ఈ క్రమంలో ఆయన్ను బరిలోకి దించితే బాగుంటునే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమౌతుంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన బీజేపీ చీఫ్ అమిత్ షా... రాజాసింగ్ కు ప్రత్యేక అపాయింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో అసద్ పై పోటీకి సిద్ధం కావాలని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ బదులు ఇచ్చినట్లు తెలిసింది
కరుడు గట్టిన హిందుత్వ వాది
రాజాసింగ్ తెలంగాణలోనే రెబల్ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది.వివావాదలు, వివాదాస్ప అంశాలతో నిత్యం వార్తల్లో నిలిచే రాజాసింగ్ .. బీజేపీ భావాజాలాన్ని అత్యంత ఫోర్స్ ఫుల్ గా వినిపించే నాయకుల్లో ఒకరు. గోషా మహల్ ఎమ్మెల్యే గా ఉన్న రాజాసింగ్ 2019 ఎన్నికల్లో హైదారాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి బస్తీమే సవాల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సామాజికవర్గం నుంచి బలమైన మద్దతు ఉన్న అసద్ ను రాజాసింగ్ ఎలా ఎదుర్కొంటారనేది హాట్ టాపిక్ గా మారింది.