తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుపై ఓ రేంజ్ దాడి చేస్తున్నారు కేసీఆర్ .. అయితే చంద్రబాబు ఇప్పటి వరకు ఆయనకు ధీటుగా ఎన్నికల ప్రచారంలోకి దిగలేదు. ఇప్పుడు ప్రచారంలోకి నేను సైతం అంటూ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీతో కలిసి రోడ్ షోలు, బహిరంసభలో పాల్గొనేందుకు సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. నాంపల్లిలో రోడ్ షో తో పాటు ఖమ్మం, అమీర్ పేట బహిరంగలో సభలో చంద్రబాబు పాల్గొంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు తెలంగాణ పర్యటన  నేపథ్యంలో ఆయన వ్యూహం ఎలా ఉండబోతుంది.. అభివృద్ధిపై ఫోకస్ చేస్తారా లేదా  కేసీఆర్ పై ఎదురు దాడికి ప్రాధాన్యత ఇస్తారా ? ఒక వేళ ఎదురుదాడి చేస్తే అది ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠంగా ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు కేసీఆర్ పై ఎదురుదాడి కంటే హైదరాబాద్  అభివృద్ధిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ప్రసంగించారు. తాను ఎలా హైదరాబాద్ ను అభివృద్ధిపథంలో నడిపారో వివరించేందుకు అప్పట్లో చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అప్పటి పరిస్థితి వేరు అని.. ఏపీ పునర్ నిర్మాణ పనుల్లో బీజీగా ఉండటంతో కేసీఆర్ ను వదిలి పెట్టారు..ఈ సారి అలా ఉండదని..కేసీఆర్ సర్కార్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు


మరోవైపు చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే టీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండనుందనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ గురించి చంద్రబాబు మాట్లాడితేనే కస్సు బIస్సు మనే కేసీఆర్.. ఏకంగా ఈ గడ్డపై అడుగుపెడితే ఊరుకుంటారా ..గతంలో కంటే మరింత తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే జరిగితే తెలంగాణ రాజకీయ వేడి తాజా స్థాయికి చేరుకుంటుంది.