ట్విట్టర్ ( Twitter ) యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ( Telangan minister KTR ) ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఓ సభలో తన ఫోటో తీసిన చిన్నారిని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ కేటీఆర్ మనస్సు దోచుకున్న ఆ చిన్నారి ఎవరు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టీఆర్ఎస్ ( TRS ) వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ట్వీట్లు చేస్తూ ట్విట్టర్ పై యాక్టివ్‌గా ఉంటారు. నిన్న హైదరాబాద్ పరిధిలో పలు అభివృద్ధి పనుల్లో..కార్యక్రమాల్లో బిజీగా గడిపిన కేటీఆర్ దృష్టికి ఓ అంశం బాగా ఆకర్షించింది. తన మనస్సును బాగా దోచుకున్నాడని ఓ చిన్నారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 


తెలంగాణ ( Telangana ) మంత్రి కేటీఆర్ బల్కంపేట్‌లో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. తరువాత సనత్‌నగర్‌లోని థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి మంత్రి తలసానితో కలిసి భూమి పూజ చేశారు. మోండా మార్కెట్ వద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని, మారేడ్‌పల్లిలో జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌ హాల్‌‌ను ప్రారంభించారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అదే విధంగా సనత్‌ నగర్‌ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, సనత్‌ నగర్‌లోని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 


ఇంతవరకూ బాగానే ఉంది. సనత్ నగర్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్‌ఫోన్‌తో మంత్రి కేటీఆర్ ఫోటో తీశాడు. ఈ ఫోటోను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ( Trs Mla Balka suman ) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పిక్ ఆఫ్ ద డే క్యాప్షన్ పెట్టారు. కేటీఆర్ దృష్టిలో పడిన ఈ ఫోటోను...కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. 


ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి తన పని కానిచ్చాడు..అంటూ కేటీఆర్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశారు.


కేటీఆర్ మనస్సు దోచిన ఆ చిన్నారి ఎవరనే అంశంపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. Also read: Diwali2020: 5 శతాబ్దాల క్రితం..మళ్లీ ఇప్పుడు..నిజంగా అద్భుత దీపావళి ఇది