Theatres in Telangana: థియేటర్లలో సినిమా చూసే ఆనందం, ఆ ఫీల్‌గుడ్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతున్నాం అనుకునే వారికి తెలంగాణ సర్కారు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం థియేటర్ల యజమానులకు అనుమతించింది. ఇది ఆడియెన్స్‌కే కాదు.. సినిమా వాళ్లకు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా పెద్ద గుడ్ న్యూసే. 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Bahubali before the beginning: వెబ్ సిరీస్ రూపంలో బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్


కరోనావైరస్ సెకండ్ వేవ్ (Corona second wave) కారణంగా మూతపడిన థియేటర్లు తెరుచుకోనుండటంతో ఇప్పటివరకు ఓటీటీల్లో విడుదలైన సినిమాలు, ఇంకా విడుదలకు నోచుకోని సినిమాలను విడుదల చేసేందుకు దర్శకులు, నిర్మాతలు ప్లాన్స్ చేసుకుంటున్నారు.


Also read : Sonu Sood's flat in Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లాట్ కొన్న సోనూ సూద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook