MLC Kavitha CBI Enquiry: ఎమ్మెల్సీ కవిత కేసు కథ కంచికి చేరిందా..? ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ సైలెంట్ అయిపోయిందా..? ఎందుకు ఈ కేసుపై ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా డీలా పడిపోయింది. ఇదిగో అరెస్టులే అంటూ హడావుడి చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం అంతా సైలెంట్ అయిపోయింది. నిందితులకు బెయిల్స్ కూడా వస్తున్నాయి. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి చేరింది. కానీ ఇంకా కేసు టేకప్ చేయలేదు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత లాంటి వారిని టార్గెట్ చేశారని చెబుతున్నా.. ఈడీ , సీబీఐ మాత్రం ఇప్పటి వరకూ వారిపై ఎఫ్ఐఆర్ కానీ చార్జిషీటు దాఖలు చేయడం లేదు. ఓ నిందితుడి చార్జిషీటులో మాత్రం ఢిల్లి లిక్కర్ పాలసీలో లాభం పొందిన సౌత్ లాబీలో కవిత అసలైన భాగస్వామి అని ఆరోపించారు. అంటే ఈ దిశగా ఈడీ, సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయని భావించారు. అయినా  కేసు ముందుకు సాగడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మాత్రమే కాదు మ్మెల్యేలకు ఎర కేసులోనూ సీబీఐ ఇంకా కదల్లేదు.


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు. సీబీఐతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈడీ చార్జీషీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉంది. ఇక డిసెంబర్ 11న సీబీఐ ముందు హాజరైంది ఎమ్మెల్సీ కవిత. 161 సీఆర్పీసీ నోటీసుల్లో భాగంగా ఏకంగా 7 గంటల పాటు కవితను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. విచారణ ముగిసిన వెంటనే 91 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. ఏదైనా కేసుకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్, మెటీరియల్ ఆధారాలు ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. పత్రాలు, సీడీలు, ఫోన్లు, ఇతర మెటీరియల్ ఎవిడెన్స్ అందించాలని సీబీఐ కోరితే.. స్వయంగా వెళ్లి ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ సమర్పించిన చార్జిషీట్‌లో కవిత ఏడు ఫోన్లను ధ్వంసం చేసిందని వెల్లడించింది. దీంతో ఫోన్ల కోసమే కవితకు 91 సీఆర్పీసీ నోటీసు ఇచ్చారని భావించారు. 


కానీ 91 సీఆర్పీసీ నోటీసు ఇచ్చి  నాలుగు వారాలు కావొస్తున్నా సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కవిత కేసులో సీబీఐ సైలెంట్ అయిందనే ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయవర్గాలు రెండు కారణాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఓ అండర్ స్టాండింగ్‌కు రావడం. ఇది ఎంత వరకూ నిజమవుతుందో చెప్పలేం. కానీ రాజకీయాల్లో ఇలా పార్టీల అంతర్గతంగా కొన్ని అంశాలపై సర్దుకుపోవడం కామన్‌గానే జరుగుతూ ఉంటుంది. మరోవైపు టైమింగ్ చూసి ఎటాక్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వేచి చూస్తున్నాయనే టాక్ వస్తోంది.


Also Read: Fastest Ball By Indian Bowler: టీమిండియా తరుఫున అత్యంత వేగవంతమైన టాప్-5 బౌలర్ల వీళ్లే..   


Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook