హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళనల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని వలస కూలీలు సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. కానీ తెలంగాణలో సీన్ రివర్స్ అయింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ సందర్భంగా సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తిరిగి వస్తున్నారు. తొలి విడతగా బీహార్ నుండి 225 మంది వలస కూలీలు హైదరాబాద్‌కు వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు తరలి వెళ్తున్న తరుణంలో తెలంగాణాలో మాత్రం రివర్స్ జరుగుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుంచి కూలీలు ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో లింగంపల్లి స్టేషన్‌కు చేరుకున్నారు. వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ సుల్తానియా, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సమీక్షించారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!