Warangal: వరంగల్‌లో పట్టపగలే చోరీ.. సినిమా స్టైల్లో డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు
Thieves steal Rs 25 lakh in Warangal : కారులో ఉన్న25లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించుకొని వెళ్లారు. ప్రకాశ్‌రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్‌రోడ్డులోని ఒక బ్యాంకుకు వెళ్లాడు. తన చిన్నకుమారుడు కృష్ణవంశీ తన ఖాతా నుంచి 5లక్షలు రూపాయలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లి పోయాడు.
Thieves steal Rs 25 lakh at parking car in Warangal: అత్యంత రద్దీగా ఉండే వరంగల్ నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో పట్టపగలే సినిమా స్టైల్లో చోరీ జరిగింది. మధ్యాహ్నం నక్కలగుట్టలోని (Nakkalagutta) ఓ బ్యాంకు ముందు నిలిపి ఉంచిన కారు అద్దాలు పగులగొట్టారు దుండగులు. ఆ కారులో ఉన్న25లక్షల రూపాయల (25 lakhs) నగదును దొంగలు అపహరించుకొని వెళ్లారు. ప్రకాశ్‌రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి (Kondabattula Tirupati) తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్‌రోడ్డులోని ఒక బ్యాంకుకు వెళ్లాడు. తన చిన్నకుమారుడు కృష్ణవంశీ (Krishnavanshi) తన ఖాతా నుంచి 5లక్షలు రూపాయలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లి పోయాడు. తర్వాత పెద్దకుమారుడితో కలిసి నక్కలగుట్టలోని మరో బ్యాంక్‌కు వెళ్లాడు తిరుపతి. తన ఖాతాల ఉన్న 10లక్షల రూపాయలు (10 lakhs), భార్య భాగ్యలక్ష్మి పేరు మీద ఉన్న 5 లక్షల రూపాయలు.. పెద్ద కుమారుడు సాయితేజ అకౌంట్‌లో ఉన్న మరో 5లక్షలు రూపాయలు డ్రా చేశాడు. మొత్తం 25లక్షల రూపాయలను (25 lakhs) బ్యాగులో సర్దారు. తర్వాత ఆ డబ్బును పెద్దకుమారుడు తీసుకెళ్లి బ్యాంకు ముందు పార్క్ చేసిన కారులో (Car) పెట్టారు.
Also Read : Best Tourism Village: బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లి.. ఐక్యరాజ్యసమితి గుర్తింపు
అదే టైమ్‌లో బ్యాంకు నుంచి సంతకం కోసం ఫోన్ వచ్చింది. దీంతో కారును లాక్ చేసి లోపలికి వెళ్లి తిరిగి వచ్చారు. అప్పటికే కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న డబ్బును దోచుకెళ్లారు దొంగలు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భూమి కొనుగోలు కోసం బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకుని వస్తుండగా.. ఇలా జరిగిందని తిరుపతి కన్నీటిపర్యంతమయ్యాడు.
ఇక సంఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి (DCP Pushpareddy) పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు నిందితులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఒకరు చోరీ చేసి బ్యాగ్‌తో ముందుకువెళ్లగా... మరో నిందితుడు బైక్ పై (Bike) వచ్చి తీసుకెళ్లినట్లు డీసీపీ (DCP) తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ పుష్పారెడ్డి తెలిపారు. కేసు (case) దర్యాప్తులో ఉంది.
Also Read : Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook