Best Tourism Village: పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు.. ఐక్యరాజ్య సమితి గుర్తింపు

Best Tourism Village: వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్​లో భారత్​ నుంచి తెలంగాణలోని పోచంపల్లి గ్రామం ఎంపికైంది. దీంతో ఆ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఈ సందర్భంగా ఆ ఊరి ప్రజలకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 04:05 PM IST
    • తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి అరుదైన ఘనత
    • బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి
    • ఈ సందర్భంగా గ్రామస్తులకు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Best Tourism Village: పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు.. ఐక్యరాజ్య సమితి గుర్తింపు

Best Tourism Village: తెలంగాణలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) మంగళవారం ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. 2021 డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ యొక్క 24వ సెషన్ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సంస్కృతి, పర్యాటకం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పోచంపల్లి గ్రామ ప్రజలను అభినందించారు.

"పోచంపల్లి గ్రామానికి ఈ అవార్డు లభించినందుకు ప్రత్యేకించి పోచంపల్లి ప్రజల తరఫున.. తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోచంపల్లి, ఇతర ఎంట్రీలను సమర్థవంతంగా అందించినందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు కూడా ధన్యవాదాలు" అని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.

అయితే ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఈ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్​లో భారత్​ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ సంపాదించాయి.  అందులో ఒకటి తెలంగాణలోని పోచంపల్లి ఒకటి. దీంతో పాటు మేఘాలయ రాష్ట్రంలోని కాంగ్ థాన్, మధ్యప్రదేశ్​లోని చారిత్రాత్మక గ్రామం లాద్ పురా ఖాస్​ కూడా పోటీ పడ్డాయి.

పోచంపల్లి ప్రత్యేకత

పోచంపల్లి ఇక్కత్ టై అండ్ డై పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ వస్త్రాలకు పేటెంట్ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ చేనేత కళాకారులకు ఎంతో ప్రతిభ ఉంది. గడిచిన మూడేళ్లలో భోగ బాలయ్య, సాయని భరత్, భారత వినోద్ లాంటి వాళ్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును అందుకున్నారు. పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన అనేక రకాల ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సాంప్రదాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను ఇక్కడి ప్రజలు జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు.

Also Read: Bandi Sanjay's convoy పై కోడి గుడ్లు, రాళ్లతో దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

Also Read: Siddipet Collector Venkatram Reddy: సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా.. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరిక?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News