Covid-19 deaths: హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( Govt General Hospital ) లో దారుణం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో సమయానికి ఆక్సిజన్ అందక నలుగురి నిండు ప్రాణాలు బలయ్యాయి. సమయానికి ఆక్సిజన్ అందించలేదని, వైద్యులు పట్టించుకోకపోవడంతోనే నలుగురు రోగులు చనిపోయారని ఆరోపిస్తూ మృతుల కుటుంబసభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగారు. అయితే  మృతుల్లో ముగ్గురు కరోనావైరస్ ( Coronavirus) సోకిన రోగులు ఉండగా.. మరొకరు సాధరణ వార్డులో చికిత్స పొందుతున్న రోగి ఉన్నారు. సకాలంలో వైద్యం అందక జిల్లాకే చెందిన నలుగురు మృతి చెందిన తీరుపై స్థానికులు ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. Also read: జీహెచ్ఎంసీలో కరోనా ర్యాపిడ్ టెస్టులు షురూ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్థరాత్రి ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయాయి. ఈ క్రమంలో కోవిడ్-19 విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు కరోనా బాధితులు, సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న మరొక రోగి ప్రాణాలు విడిచారు. ఆక్సిజన్ అందక గురువారం రాత్రి 10.30 సమయంలో.. శుక్రవారం తెల్లవారుజామున 1గంటకు, రెండుగంటలకు వరుసగా ముగ్గురు కరోనా రోగులు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని ధర్నా చేపట్టారు. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. Also read: కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య.. ఊహించని ట్విస్ట్


ఇదిలా ఉంటే ఈ విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేశ్వర రావు మాట్లాడుతూ.. '' ఆక్సిజన్ లేకపోవడం వల్ల రోగులు చనిపోలేదని, వారి పరిస్థితి విషమించడంతోనే చనిపోయారు" అని పేర్కొన్నారు. చనిపోయిన కోవిడ్-19 రోగులు ధీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ఆక్సిజన్ అందకనే చనిపోయారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos