Gun Attack on AIMIM Chief Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఒవైసీ కారుపై గుర్తుతెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మేరట్​ జిల్లా కిథౌర్​లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై కారుపై కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు మూడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. 3-4 తూటాలు కారు కింది భాగంలోకి దూసుకెళ్లాయి. మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయలుదేరాను. ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్ల బూల్లెట్స్ దూసుకెళ్లాయి. దాంతో నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు-నలుగురు ఉన్నారు. నేను వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని ఏఎన్​ఐ వార్తా సంస్థతో అసదుద్దీన్​ ఒవైసీ చెప్పారు. 


ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీపై హత్యాయత్నం చేసేందుకు నలుగురు దుండ‌గులు ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంకు వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది. కాల్పుల త‌ర్వాత తుపాకులు ఘ‌ట‌నా స్థ‌లంలోనే వ‌దిలి దుండుగులు పారిపోయారని సమాచారం. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికీ ఏమీ కాలేదు. కారుకు బుల్లెట్లు త‌గిలిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. 


Also Read: IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్ 2022.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ! కానీ..!!


Also Read: పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. మండిపడిన 'డీజే టిల్లు' హీరోయిన్?