పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. మండిపడిన 'డీజే టిల్లు' హీరోయిన్?

డీజే టిల్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సిద్దు మాట్లాడుతుండగా ఓ ప్రముఖ జర్నలిస్టు హద్దులుదాటి.. నిజంగానే తెలుసుకున్నారా ఏందీ ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో అని హీరోయిన్‌కి అని ప్రశ్నించాడు. జర్నలిస్టు ప్రశ్నపై నేహా శెట్టి అసహనం వ్యక్తం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 03:12 PM IST
  • డీజే టిల్లు ట్రైలర్‌ సందడి షురూ
  • పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు
  • హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే?
పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. మండిపడిన 'డీజే టిల్లు' హీరోయిన్?

Neha Shetty slams Journalist over Moles: టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీనిర్మించిన 'డీజే టిల్లు' సినిమాకి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పుర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం  బుధవారం హైదరాబాద్‏లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

'డీజే టిల్లు' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అందరూ సినిమా గురించి మాట్లాడారు. సందర్భంగా ఓ ప్రముఖ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ట్రైలర్‌లో హీరోయిన్ పుట్టుమచ్చల సంబంధించి ఓ డైలాగ్ ఉంది. 'మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు' అని హీరో అడగ్గా.. 'పదహారు' అని హీరోయిన్ రిప్లై రిప్లై ఇస్తుంది. స్టేజ్ మీద హీరో సిద్దు మాట్లాడుతుండగా ఓ ప్రముఖ జర్నలిస్టు హద్దులుదాటి.. నిజంగానే తెలుసుకున్నారా ఏందీ ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో అని హీరోయిన్‌కి అని ప్రశ్నించాడు. వెంటనే హీరో ఇబ్బంది పడుతూ.. ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం అని రిప్లై ఇస్తాడు. 

ప్రముఖ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. జర్నలిస్టు ప్రశ్నపై నేహా శెట్టి అసహనం వ్యక్తం చేశారు. ప్రచార వేడుకల్లో ఇలాంటి ప్రశ్న ఎదురవటం చాలా దురదృష్టకమని ట్వీట్ చేశారు. 'ఈ రోజు ట్రైలర్ లాంచ్‌లో ఇలాంటి ప్రశ్న ఎదురవటం చాలా దురదృష్టకరం. ఉద్యోగం చేసే దగ్గర, తన ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల అతడికి ఎంత గౌరవం ఉందో ఈ ప్రశ్న తెలియజేస్తుంది' అని నేహా శెట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయం డీజే టిల్లు నిర్మాత నాగవంశీ క్షమాపణలు చెప్పాడు. 

విషయం నెట్టింట రచ్చ కావడంతో సదరు జర్నలిస్టు స్పందించాడు. డీజే టిల్లు రొమాంటిక్‌ ఫిల్మ్‌ అని, తాను అడిగింది కూడా  రొమాంటిక్‌ ప్రశ్న అని అన్నాడు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని, దయచేసి తనని తప్పు పట్టొద్దు అని విలేకరి ట్విటర్‌ వేదికగా కోరాడు. చివరగా డీజే టిల్లు ట్రైలర్‌ చాలా బాగుందని పేర్కొంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై కొందరు ఫైర్ అవుతుంటే.. మరికొందరు మాత్రం మద్దతు ఇస్తున్నారు. 

Also Read: F3 First Lyrical Song: 'ఎఫ్ 3' ప్రమోషన్స్ షురూ.. 'లబ్ లబ్ లబ్ డబ్బు' సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Also Raed: SSMB28 Shooting: మహేష్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ షూటింగ్ ప్రారంభం.. ముహూర్తపు షాట్ లో నమ్రత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x