IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్ 2022.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ! కానీ..!!

ఐపీఎల్‌ 2022 భారత్‌లోనే జరుగుందని బీసీసీఐ బాస్ సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు.   దేశంలో కేసులు పెరిగితే మాత్రం ఈసారి కూడా క్యాష్ రిచ్ లీగ్ దేశం దాటనుందని దాదా చెప్పకనే చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 04:37 PM IST
  • ఐపీఎల్​ వేదికపై గంగూలీ కీలక ప్రకటన
  • భారత్‌లోనే ఐపీఎల్ 2022
  • దేశంలో కేసులు పెరిగితే మాత్రం
IPL 2022: భారత్‌లోనే ఐపీఎల్ 2022.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ! కానీ..!!

Sourav Ganguly says IPL 2022 is likely to be held in India: భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యూఏఈలో లేటుగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021 భారత్‌లోనే మొదలవగా.. పలు జట్లలో కేసులు బయటపడడంతో మళ్లీ యూఏఈలోనే మిగతా సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఇప్పుడు కూడా దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ 2022 వేదికపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఓ స్పష్టత ఇచ్చారు. 

ఐపీఎల్‌ 2022 భారత్‌లోనే జరుగుందని బీసీసీఐ బాస్ సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. 'ఐపీఎల్‌ 2022ను ఎట్టిపరిస్థితిలో భారత్‌లోనే నిర్వహిస్తాం. అయితే కరోనా వైరస్ విజృంభణ తారస్థాయికి చేరనంత వరకే' అని దాదా స్పోర్ట్స్‌ స్టార్‌తో మాట్లాడుతూ అన్నారు. వేదికల విషయంపై గంగూలీ మాట్లాడుతూ... 'మహారాష్ట్రలోని ముంబై, పుణెలో మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో ఉన్నాం. నాకౌట్‌ దశకు త్వరలోనే వేదికను ఖరారు చేస్తాం' అని అన్నారు. దేశంలో కేసులు పెరిగితే మాత్రం ఈసారి కూడా క్యాష్ రిచ్ లీగ్ దేశం దాటనుందని దాదా చెప్పకనే చెప్పారు. 

మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్‌లో కరోనా కేసుల ఉధృతి ఎలా ఉండేదన్న దానిపై ఐపీఎల్ 2022 నిర్వహణ ఆధారపడి ఉంది. ముంబైలోని వాంఖడే మైదానం, డీవై పాటిల్‌ స్టేడియం, సీసీఐతో పాటు పుణె స్టేడియంలో ఐపీఎల్‌ 15 లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాకౌట్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలుస్తోంది. 

ఒకవేళ భారత్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటేమాత్రం ఐపీఎల్‌ 2022ను మరోసారి యూఏఈకి తరలిపోయే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక బోర్డులు కూడా ఐపీఎల్ ఆతిథ్యంపై ఆసక్తిగా ఉన్నాయి. అయితే కొత్త కేసులు దక్షిణాఫ్రికాలోనే పుట్టుకొస్తున్న నేపథ్యంలో టోర్నీ అక్కడికి వెళ్లడం దాదాపు అసాధ్యమే. కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌ వచ్చిన నేపథ్యంలో ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 74 లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్న సంగతి తెలిసిందే. 

Also Read: పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. మండిపడిన 'డీజే టిల్లు' హీరోయిన్?

Also Read: F3 First Lyrical Song: 'ఎఫ్ 3' ప్రమోషన్స్ షురూ.. 'లబ్ లబ్ లబ్ డబ్బు' సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News