Students Drown in peddapalli: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో చోటుచేసుకుంది. శుక్రవారం సెలవుదినం కావడంతో విద్యార్థులు రామయ్య కాలనీలో గల నీటికుంట దగ్గరకు స్విమ్మింగ్ చేయడానికి వెళ్లారు. నీటిలోకి దిగిన కాసేపటికే వారిలో ఇద్దరు మృత్యు ఒడికి చేరగా... మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులను ఎన్టీపీసీ న్యూ పోరేటపల్లికి చెందిన విక్రమ్‌, ఉమామహేశ్ సాయిచరణ్‌గా గుర్తించారు. చిన్నారుల మరణ వార్త విని వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.  వీరంతా ఎనిమిదో తరగతి చదువుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Hyderabad: విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితుడు మృతి..


రీసెంట్ గా ఇలాంటి ఘటనే..
ఈ నెల ప్రారంభంలో ఇలాంటి ఘటనే జరిగింది. నీటిలో జలక్రీడలు ఆడేందుకు నలుగురు విద్యార్థులు నలియా నదికి వెళ్లి నీటమునిగారు. వీరి కేకలు విన్న స్థానికులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన  ఒడిశా భద్రక్‌ జిల్లా నలియాలో ఏప్రిల్ 4న చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Also read: Hyderabad Rains: హైదరాబాద్‌ నగర ప్రజలకు ఉపశమనం.. ఒక్కసారిగా మారిన వాతావరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి