TIMS Hospitals: హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నగరం నలు మూలలా టీమ్స్ ఆస్పత్రలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ భుజానకెత్తుకుంది. కొత్తగా నిర్మించ తలపెట్టిన ఈ ఆస్పత్రులకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.  ఎయిమ్స్ మాదిరిగా టిమ్స్ ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించనున్నారు. ఇందులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కో టిమ్స్ ఆస్పత్రిలో 30 డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. గుండె, కిడ్నీ, మెదడు, ఊపిరితిత్తులు, కేన్సర్, ట్రామా కేర్, ఎలర్జీ, వ్యాధి నిర్ధారణ ఇలా అనేక విభాగాలు ఉంటాయి. 200 మంది సిబ్బంది, 500 మంది దాకా రెసిడెంట్ డాక్టర్లతో ఏర్పాటు చేస్తారు. ఒకేసారి ఆపరేషన్‌ చేసేలా  26 ఆపరేషన్ థియేటర్స్ టిమ్స్‌లో సిద్ధం చేయడం విశేషం. ఒక్కో ఆస్పత్రిని వెయ్యి పడకలతో నిర్మించనున్నారు. 1000 పడకలకు ఆక్సిజన్ సరఫరా, 300 ఐసీయూ పడకలు ఉండేలా ఏర్పాటు చేస్తారు. శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఈ ఆస్పత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా..ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై భారం తగ్గించేలా కసరత్తు చేస్తున్నారు.


ఎల్బీనగర్‌లో   21.36 ఎకరాల్లో టిమ్స్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం 900 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. ఇక్కడ 14 అంతస్తుల్లో వెయ్యి పడకలతో టిమ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎర్రగడ్డలో 60 ఎకరాల్లో నిర్మించేలా రంగం సిద్ధం చేశారు. 882 కోట్ల వ్యయంతో 14 అంతస్తుల్లో  ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఇక అల్వాల్ లో 28.41 ఎకరాల్లో టిమ్స్ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఐదు అంతస్తుల ఆస్పత్రి నిర్మాణం కోసం 897 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.


ఈ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పీజీ, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు అందుబాలోకి రానున్నాయి. నగర శివారుల్లో నిర్మిస్తున్న టిమ్స్ సరిహద్దు జిల్లాల ప్రజల వైద్య అవసరాలు తీర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎల్బీ నగర్‌ ఆస్పత్రి ద్వారా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లా వాసులకు సేవలు అందనున్నాయి. ఆల్వాల్‌లో ఏర్పాటు చేసే ఆస్పత్రితో సంగారెడ్డి, సిద్ధిపేట, అదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందుతాయి.


Also Read: King Cobra in Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో నాగుపాము కలకలం


Also Read: adipurush: ఆదిపురుష్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.