Kodandaram: సీఎం కేసీఆర్‌పై టీజేఎస్ చీఫ్‌ కోదండరామ్ ఫైర్ అయ్యారు. ఆయన తక్షణ రాజకీయ అవసరాల కోసమే ఆలోచిస్తున్నారని..దీర్ఘకాలిక ప్రయోజనాలపై కాదన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్ లాంటి వారికి సిద్ధాంతం ఉందని..అందుకే ఆర్థిక నమూనా తయారు చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు అవేమి లేవని విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జాతీయ పార్టీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అధికారాన్ని వాడుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కోదండరామ్. 


జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్ ఏంటో వివరిస్తామన్నారు. హైదరాబాద్‌, ఢిల్లీల్లో సదస్సులు ఏర్పాటు చేస్తామని..ఇందులో భారత రాష్ట్ర సమితి, తెలంగాణ మోడల్ కుట్రలను బహిర్గతం చేస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెబుతున్నారని..ఐతే కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయని కోదండరామ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన అజెండాతో ముందుకు రావాలన్నారు. 


మునుగోడులో తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు టీజేఎస్ చీఫ్‌ కోదండరామ్. త్వరలోనే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నామని..అలా అయితే అందరూ సపోర్ట్ చేస్తామని తెలిపారు. టీజేఎస్ తరపున తాము కూడా గద్దర్‌కు మద్దతు ఇస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ కీలకంగా వ్యవహరించారు.


తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ఆయన పాత్ర తగ్గిపోయింది. సీఎం కేసీఆర్ కావాలనే పక్కకు పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వడం లేదన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో కోదండరామ్..తెలంగాణ జన సమితిని స్థాపించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో మహా కూటమిలో చేరారు. ఐతే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. రెండోసారి గులాబీ బాస్ కేసీఆర్ ఘన విజయం సాధించారు.


Also read:మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి!


Also read:Munugode Bypoll: మునుగోడులో రెడ్డి వర్సెస్ రెడ్డి..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook