Medaram Jathara 2024: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతరలు నిర్వహించారు.


నేడు చివరిఘట్టమైన వనప్రవేశం జరగనుంది. గురువారం రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చారు. చివరిరోజు ఈరోజు శనివారం కూడా కావండంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఏపీ నుంచి కూడా కొంతమంది రైతులు మేడారం జాతరను దర్శించుకున్నారు. అమరావతినే రాజధానిగా చేయాలని, సీఎం జగన్ మనస్సు మారాలని అమ్మవార్లను కోరుకున్నారు. శుక్రవారం  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇతర ప్రముఖులు కూడా ఈ జాతరను తిలకించడం విశేషం.


ఇదీ చదవండి: Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నారా? మీకు బిగ్ అలెర్ట్..


అయితే, జాతరకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ 6వేల బస్సులు ఏర్పాటు తేసింది. ఇదిలా ఉండగా మేడారం జాతరకు  దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు రైళ్లు నడపడం ఇదే తొలిసారి. ఈ రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరీ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.


ఇదీ చదవండి: School Holidays: తెలంగాణలో నాలుగు రోజులు స్కూల్స్‌, ఆఫీసులు బంద్‌.. ఎందుకంటే..?


ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీంతో మన రాష్ట్రానికి చెందిన మహిళలు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అయితే, మేడారం జాతరకు కూడా ఉచిత బస్సు సౌకర్యం పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 14వేల మంది పోలీసులు , 4800 సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రతా చర్యలతోపాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి