Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నారా? మీకు బిగ్ అలెర్ట్..

Medaram Jatara: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 20, 2024, 01:06 PM IST
Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నారా? మీకు బిగ్ అలెర్ట్..

Medaram Jatara: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. రేపటి నుంచి అంటే 2024  ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతరలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారు.. బీఆర్ఎస్ ను ఏకీపారేసిన సీఎం రేవంత్ రెడ్డి..

అయితే, జాతరకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ 6వేల బస్సులు ఏర్పాటు తేసింది. ఇదిలా ఉండగా మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తీపిగబురు ఈ జాతరకు దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కాజీపేట వరకు రైళ్లు నడపడం ఇదే తొలిసారి. ఈ రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరీ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

సిర్పూర్ కాగజ్‌నగర్ – వరంగల్ – సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లు:  07017/07018
వరంగల్ – సికింద్రాబాద్ – వరంగల్ రైళ్లు :07014/07015
నిజామాబాద్ – వరంగల్ – నిజామాబాద్: 07019/0720

ఇదీ చదవండి: Dengue Fever: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీంతో మన రాష్ట్రానికి చెందిన మహిళలు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అయితే, మేడారం జాతరకు కూడా ఉచిత బస్సు సౌకర్యం పథకం వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 14వేల మంది పోలీసులు , 4800 సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రతా చర్యలతోపాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News