Prakash Raj: రాజ్యసభ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలో మూడు ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇందులో ఓ స్థానానికి సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో 57 రాజ్యసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల భర్తీకై నోటిఫికేషన్ ఈ నెల 24వ తేదీన జారీ కానుంది. జూన్ 10వ తేదీ పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఇందులో రెండు బీసీ, ఒకటి ఓసీ ఉన్నాయి. సంఖ్యాబలాన్ని బట్టి మూడు స్థానాలు కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే దక్కనున్నాయి. ఈ మూడు స్థానాల భర్తీకై మోత్కుపల్లి నర్శింహులు, లక్ష్మణరావు పీఎల్ శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు దామోదర్ రావు, సీఎల్ రాజం, హెటిరో పార్ధసారధి రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. 


అదే సమయంలో ఆసక్తిగా ప్రకాష్ రాజ్ పేరు విన్పిస్తోంది. కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్..కేసీఆర్‌తో సన్నిహతంగా మెలగడమే దీనికి కారణంగా పలువురు విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్..ప్రకాష్ రాజ్ పేరు పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. స్వతహాగా బీజేపీని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ అయితే రాజ్యసభకు సరిగ్గా సరిపోతుందనేది కూడా మరో ఆలోచనగా కన్పిస్తోంది. అయితే ఇప్పటివరకూ ఇదంతా కేవలం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే విన్పిస్తున్న టాపిక్. దీనిపై అధికారికంగా టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.  


Also read: Telangana Weather Report: తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. రానున్న 3 రోజులూ వర్షాలే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.