Telangana: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల, సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, ఒకరి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ వివాదం మొదలైంది. ఇకపై ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ క్రమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప 2 బాక్సాఫీసులోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కదలికలు రేపింది. సంద్య ధియేటర్ తొక్కిసలాటలో ఒకరు మరణించడంతో చోటుచేసుకున్న పరిణామాలు టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమైంది. ఇకపై ఎలాంటి టికెట్లు పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని ఏకంగా మంత్రి కోమటిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేయడంతో తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేగింది. వివాదం పెరిగి పెద్దది కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటైంది. భేటీకు అంతా సిద్ధం చేసిన మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ హాజరు కాలేదు. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత ఇదే


అదే సమయంలో రేవంత్ రెడ్డితో సమావేశంలో అక్కినేని నాగార్జున హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైంది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోనే. ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు కూడా వేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున ఒకే భేటీలో పాల్గొనడం లేదా ఎదురెదురు కావడం ఇదే తొలిసారి. అందుకే ఈ ఇద్దరి భేటీ ఎలా ఉంటుందోననే చర్చ ఆసక్తి కల్గిస్తోంది. 


అటు అల్లు అరవింద్ కూడా ఈ భేటీలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డితో సమావేశంలో అటు నాగార్జున, అటు అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో, ఏం మాట్లాడనున్నారో అనేది కూడా ఆసక్తి కల్గిస్తోంది. 


Also read: AP Heavy Rains: ఏపీని వీడని భారీ వర్షాలు, రానున్న 24 గంటలు తస్మాత్ జాగ్రత్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.