Telangana: తెలంగాణలో రాజకీయం మళ్లీ వెడెక్కనుంది. దీంతో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లే కనిపిస్తోంది. టీఆర్ఎన్ నుంచి అధికారాన్ని కైవలం చేసుకోవాలని ఉవ్వీళ్లు ఊరుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు తెలంగాణపై  కన్నేశారు. తమ పార్టీ కార్యక్రమాల వేగం పెంచారు. దీంతో వచ్చే నెలలలో ఈ రెండు పార్టీల అగ్రనేతలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెలలో ఈ రెండు పార్టీల హడావిడి తెలంగాణలో కనిపంచనుంది. ధాన్యం కొనుగోలు అంశం అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షాల మధ్య నిప్పులు రాజేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ధాన్యం కొనుగోళ్లపై ఐదెంచెల ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఏప్రిల్‌ నెల మొత్తం ఈ అంశంపై ఉద్యమించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ముగింపు సభను వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ భారీ బహిరంగ సభును పూర్తిగా రైతులతో నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు  పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తోంది. వాస్తవానికి డిసెంబరు 9నే నిరుద్యోగ సమస్యపై భారీ బహిరంగ సభ నిర్వహించి దానికి రాహుల్‌ను రప్పించేందుకు రేవంత్‌రెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. అంతకు ముందు కూడా రాహుల్‌గాంధీని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే  అప్పట్లో అది సాధ్యం కాలేకపోయింది. దీంతో ఏప్రిల్‌ చివరి వారంలో జరిగే సభకు రాహుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా రప్పించి సభను విజయంతం చేయాలని టీపీసీసీ పట్టుబదలతో ఉంది. వచ్చే ఎన్నికల సమరానికి ఈ సభను కిక్‌ స్టార్ట్‌గా ఉపయోగించుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. 


ఇక ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌తో పోటీ పడుతున్న బీజేపీ కూడా దీనికి అనుగుణంగా కార్యక్రమాల వేగం పెంచింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఏప్రిల్‌ 14న రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు ఊపును ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేత అమిత్‌షా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తన యాత్రతో తెలంగాణలోని పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు బలమైన సందేశాన్ని ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నారు. భద్రాద్రి రాములవారి కల్యాణానికి అమిత్‌షా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటీవలే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తెలగాణ పై దృష్టి సారించింది. 


కేజ్రీవాల్‌ మార్కు పరిపాలనను తెలంగాణలోనూ తీసుకొస్తామన్న నినాదంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపునూ తట్టేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఇందిరా శోభన్‌ తదితరులు ఏప్రిల్‌ 14 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. దీన్ని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు. పలువురు ప్రముఖులు ఆయన సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశం ఉంది. మొత్తానికి ఏప్రిల్‌లో తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతల పర్యటనల హడావుడి చోటుచేసుకోనుంది.


Also read: New EPF Rules: ఏప్రిల్ నుంచి మారనున్న పీఎఫ్​ రూల్స్​.. పూర్తి వివరాలు ఇవే..


Also read: Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు ఎంత? ఏ రాష్ట్రంలో అత్యధికం?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook