హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus positive cases in Telangana ) మళ్లీ విజృంభిస్తోంది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో 107 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 49 మందికి ( Saudi Arabia deportees ) కరోనా సోకినట్టు గుర్తించగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలలోనూ 19 మందికి ( Migrant workers ) కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ సోకిన వారి సంఖ్య మెత్తం 2098కి చేరింది. వీళ్లలో ప్రస్తుతం 714 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కరోనాతో కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1321 కి చేరుకుంది. Boy stuck in borewell : బోరు బావిలో పడిన బాలుడు.. స్పందించిన మంత్రి హరీష్ రావు )


తెలంగాణలో కరోనాతో బుధవారం నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 63 కి చేరింది ( Total COVID-19 death toll ). మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 297 మందికి కరోనా వైరస్ సోకినట్టు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ( Health bulletin on COVID-19 ) స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..