Telangana: కొత్తగా మరో 191 కేసులు, 8 మంది మృతి
Telangana COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన వాటిలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 143 కేసులు నమోదు కాగా.. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్ జిల్లాలో 4, జగిత్యాల జిల్లాలో, మెదక్ జిల్లాల్లో 3, నాగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాల్లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
Telangana COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన వాటిలో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 143 కేసులు ఉండగా.. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్ జిల్లాలో 4, జగిత్యాల జిల్లాలో, మెదక్ జిల్లాల్లో 3, నాగర్ కర్నూలు, కరీంనగర్ జిల్లాల్లో 2, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నేటి పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,111కు చేరింది. ( Bonalu festival: బోనాల పండగపై ప్రభుత్వం ప్రకటన )
కరోనాతో నేడు 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన మృతుల సంఖ్య 156 కి చేరింది (COVID-19 deaths). 1,817 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 2,138 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..