Bonalu festival: బోనాల పండగపై ప్రభుత్వం ప్రకటన

Bonalu festival 2020 | హైదరాబాద్ : కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాలను (Bonalu) నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25 వ తేదీ నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.

Last Updated : Jun 10, 2020, 09:00 PM IST
Bonalu festival: బోనాల పండగపై ప్రభుత్వం ప్రకటన

Bonalu festival 2020 | హైదరాబాద్ : కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాలను (Bonalu) నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25 వ తేదీ నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ ( GHMC) పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, పోలీసు తదితర శాఖల అధికారులతో పాటు వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు హాజరయ్యారు. Amitabh Bachchan: రియల్ హీరో అమితాబ్ బచ్చన్.. వలసకూలీల కోసం 6 ఛార్టర్డ్ ఫ్లైట్స్ )

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఆషాడ మాసంలో ( Aashadam) హైదరాబాద్ పరిధిలో అనాదిగా నిర్వహిస్తూ వస్తున్న బోనాల ఉత్సవాలకు (Bonalu festival) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, పాతబస్తీ బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆషాడం బోనాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాము. పరిస్థితి బాగుంటే ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా నిర్వహించి ఉండే వాళ్లం. కానీ ప్రస్తుతం కరోనావైరస్ వ్యాపిస్తున్నందున, సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక దూరం లక్ష్యం దెబ్బతినేలా బోనాల పండగను ఘనంగా నిర్వహించలేం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. 

కరోనావైరస్ ( Coronavirus) వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా బోనాల ఉత్సవాలను నిర్వహించాలని.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ భక్తులు అమ్మవారి ఆలయాలకు రావద్దని .. ఆయా ఆలయాలలో పూజారులే అమ్మవార్లకు బోనాలను సమర్పిస్తారని మంత్రి తెలిపారు. ఘటాల ఊరేగింపు కూడా అలయాల్లోనే చేపట్టాలని మంత్రి సూచించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సుబాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహా రెడ్డి, ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, కలెక్టర్ శ్వేత మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, నగర్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News