Revanth Reddy On TSPSC Paper Leak: తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఈ ఘటనకు అధికార పార్టీదే బాధ్యత అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలకు బీఆర్ఎస్ నాయకులు కూడా దీటుగా బదులిస్తున్నారు. ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతుండగా.. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తుండడంతో అధికారులు నివ్వేరపోతున్నారు. నిందితులను సిట్ బృందం లోతుగా విచారిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటు సిట్ విచారణ కొనసాగుతండగా.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. విచారణలో బావ.. తెలంగాణలో సీఎంఓలో బావమరిది అని ఆరోపణలు గుప్పించారు. 'టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా…?! విచారణలో ‘బావ’.. సీఎంఓలో బావమరిది..? మీకర్థమవుతోందా.. “పరువు”గల కేటీఆర్ గారూ..' అంటూ రాసుకొచ్చారు. ప్రొఫెసర్ బండి లింగారెడ్డి టీసీఎపీఎస్‌ మెంబర్‌ అని ఉన్న స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టంట వైరల్ అవుతోంది.


 



మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ ఘటనలో సిట్ దూకుడు పెంచింది. టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను విచారించిన సిట్.. ప్రస్తుతం టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు లింగారెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తోంది. పరీక్షల నిర్వహణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై అనితా రామచంద్రన్‌ను స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఆమెను దాదాపు రెండు గంటలపాటు విచారించారు. లింగారెడ్డి విచారణకు హాజరవ్వగా..  లింగారెడ్డి పీఏ రమేష్‌ పేపర్ల లీకేజీ ఘటనలో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇతను సిట్ కస్టడీలో ఉన్నాడు. విచారణలో సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.


Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్‌ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!  


Also Read: PBKS Vs KKR: ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్.. పంజాబ్ Vs కోల్‌కత్తా హెడ్ టు హెడ్ రికార్డులు.. పిచ్ రిపోర్ట్ ఇదే..   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి