Telangana Assembly Elections 2023: తనను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన ఘనత కాంగ్రెస్ కార్యకర్తలదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నాడని.. తెలంగాణలో నాగార్జున సాగర్, బీమా,కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. కనిపించే ఈ వెలుగు జిలుగులు కాంగ్రెస్ వల్లేనని అన్నారు. కుత్బుల్లాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"చింతమడకలో కేసీఆర్ చదివిన బడి కూడా కాంగ్రెస్ కట్టిందే.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్. బెంగాలీలు, ఒడిశా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉపాధి కలుగుతుందంటే అది కాంగ్రెస్ కృషివల్లే.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప మోదీ, కేసీఆర్ చేసిందేం లేదు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారు." అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.


కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ లోపభూయిష్ట విధాలతో అవినీతి పెరిగిందని ఆరోపించారు. లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని.. మేడిగడ్డ కేసీఆర్ అవినీతికి, దోపిడీకి బలైందన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిందని అన్నారు. నిన్న కర్ణాటక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిందని.. నేడు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని జోస్యం చెప్పారు. 2024లో ఖర్గే నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌ను ఉంచాలా.. కేసీఆర్‌ను దించాలా అని జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు. బరాబర్ కేసీఆర్‌ను దించుడే.. దంచుడే అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్‌లో కొలను హన్మంతరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.


అంతకుముందు కొత్తపల్లి రోడ్‌షోలో మాట్లాడుతూ.. కొడంగల్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తి పోతలను పడావు పెట్టి తీరని అన్యాయం చేశారని అన్నారు. ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ తేలే.. పేదలకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. కానీ కేసీఆర్ 150 గదులతో పెద్ద గడీని కట్టుకున్నాడన్నారు. పదేళ్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారని.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలను ఆదుకుంటామని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి