Telangana obc cell president Nuthi Srikanth: హైదరాబాద్: నేడు గాంధీ భవన్‌లో టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈనెల 8న కొప్పుల రాజు, అజిత్ సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలోని అంశాలను కార్యవర్గ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా నూతి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇటీవల నూతనంగా జాతీయ ఓబిసి విభాగం చైర్మన్‌గా నియమితులైన అజయ్ సింగ్ యాదవ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన సర్వోదయ సంకల్ప పాదయాత్ర గురించి వివరిస్తూ ఆ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ విభాగం ప్రతినిధులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఓబీసీ డిపార్ట్మెంట్‌లో చేపట్టాల్సిన నియామకాల గురించి చర్చించారు. రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా సూచించారు. 


2018 నాటి కాంగ్రెస్ పార్టీ బీసీల మానిఫెస్టో ప్రతినిధులకు అందరికీ అందజేశారు. ఏప్రిల్ 30వ తేదీ లోపల పది జిల్లాల్లో జరగవలసిన కార్యక్రమాల గురించి నిర్దేశించారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) ఓబిసిలకు మరింత సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ అధిష్టానం ముందుకొస్తుందని, అయితే అందుకు అనుగుణంగా అందరూ కలిసి కష్టపడి పని చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ (Nuthi Srikanth) పిలుపునిచ్చారు.


Also read : Janasena Formation Day: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన ఆవిర్భావ సభకు నో ఎంట్రీ..? పోస్టర్స్ వైరల్


Also read : Ganta Srinivasarao: స్పీకర్ గారూ..ఏడాదిగా పెండింగ్ లో ఉంది.. నా రాజీనామా ఆమోదించండి..: గంటా శ్రీనివాసరావు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook