Jagga Reddy Fires on BRS: పథకం ప్రకారమే వికారాబాద్ కలెక్టర్ హత్యకు బీఆర్ఎస్ కుట్ర చేసిందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. పోలీసులను అడ్డుపెట్టుకుని దాడికి పాల్పడిందని ఫైర్ అయ్యారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని.. దాడులకు ప్రతి దాడులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మల్లన్న సాగర్‌లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారని అన్నారు. లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి చేసి కంపెనీలను అడ్డుకుంటున్నారని.. ఇండస్ట్రీ డెవలెప్‌మెంట్ కోసం ప్రభుత్వం చూస్తుంటే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NPS Rules Change: నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఆరు కీలకమైన మార్పులు, వాటి ప్రబావం


మల్లన్న సాగర్ రైతులను కొట్టిన ఫొటోలు చూపిస్తానని.. లగచర్లలో తాము రైతులను కొట్టినట్టు ఆధారాలు చూపించి చర్చకు రావాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు దాడి చేసినట్లు అన్ని ఛానెల్స్‌లో వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనను ప్రజలు గమనించాలని కోరారు. కేటీఆర్ తనక్కేడికే రైతుల మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పదేళ్ల రాజభోగాల ఆకలి కేటీఆర్, కేసీఆర్ కుటుంబాలకు ఇంకా తీరలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలను రెచ్చగొట్టి.. దాడులకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కలెక్టర్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. అక్కడి నుంచి యాక్టివ్‌గా కలెక్టర్‌ను తరలించారని అన్నారు. లేకపోతే కలెక్టర్ ప్రాణం పోయేదన్నారు.


"రాష్ట్ర అభివృద్ధిని కుట్రలతో అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. బీఆర్ఎస్ దాడులు చేస్తే ప్రతి దాడులు ఉంటాయి. మా మీద కేసులు అయిన పర్వాలేదు దాడికి ప్రతి దాడులు ఉంటాయి. ముఖ్యమంత్రికి అండగా ఉంటాం.. కుట్రలను అడ్డుకుంటాం.. రాజకీయంగా కుట్రలను తిప్పి కొడతాం.. మీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేస్తాం. మొదటి పొరపాటుగా వదిలేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరు. సర్దుబాటు మాటలతోనే ఇంక ముందు మాటలతో ఉండదు. మమ్మలి రెచ్చగొట్టకండి మీరు తన్నులు తినకండి" అని జగ్గారెడ్డి హెచ్చరించారు. 


Also Read: Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ఒక్క రోజు డుమ్మా కొడితే మూడు రోజులు పండగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.