NPS Rules Change in Telugu: నేషనల్ పెన్షన్ స్కీమ్ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌పై కచ్చితమైన అద్భుత లాభాలుంటాయి. అందుకే ఈ స్కీమ్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ స్కీమ్‌గా మారింది. ఈ స్కీమ్‌లో ఇప్పుడు కీలకమైన మార్పులు వచ్చాయి.
నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ పధకం. ఇందులో నిర్ధారిత పెన్షన్ ఉండదు కానీ రిటర్న్స్ కచ్చితంగా ఉంటాయి. ఎన్‌పీఎస్ ఎస్సెట్స్ 37 శాతం పెరిగాయి. 58 లక్షల ప్రభుత్వేతర ఉద్యోగులు ఈ స్కీమ్‌లో 2.67 లక్షలకోట్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్‌పీఎస్ కీలకమైన గేమ్ ఛేంజింగ్ స్కీమ్ అవుతోంది. ఇప్పుడీ స్కీమ్‌లో 6 కీలకమైన మార్పులు వచ్చాయి. అవేంటో చూద్దాం. మొదటిది ఎన్‌పీఎస్ విత్‌డ్రాయల్ నిబంధన. ఇప్పుడు ఖాతాదారులు మొత్తం నగదు నుంచి 60 శాతం మాత్రమే విత్ డ్రా చేయగలడు. దీనిపై ట్యాక్స్ ఉండదు. మిగిలిన 40 శాతం యాన్యుటీ ప్లాన్ కొనుగోలుకు వినియోగించాలి. అంటే 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే 40 శాతం యూన్యుటీ ప్లాన్స్ కోసం వెచ్చించాలి.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎన్‌పీఎస్ ఖాతాదారులు పిల్లల ఉన్నత చదువులు ఇంటి కొనుగోలు, వైద్య ఖర్చుల కోసం కొద్దిగా కొద్దిగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. 60 శాతం వరకూ సిస్టమేటిక్ లంప్సమ్ విత్‌డ్రాయల్ సాధ్యమౌతుంది. టైర్ 2 ఎన్ పీఎస్ ఖాతాదారులకు ఈక్విటీ కేటాయింపుని ప్రభుత్వం 75 శాతం నుంచి 100 శాతం ట్యాక్స్ ఫ్రీ చేసింది. ఫలితంగా ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకునేందుకు వీలవుతుంది.
ఇక ట్యాక్స్ డిడక్షన్ విషయంలో ఎన్‌పీఎస్ కీలకంగా ఉపయోగపడనుంది. బేసిక్ శాలరీ 1 లక్ష ఉంటే నెలకు 4 వేల చొప్పున డిడక్షన్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ నిబంధనలు కూడా మారాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా 60 ఏళ్ల వయస్సులో 75 శాతం వరకూ ఈక్విటీ చేయవచ్చు.
Also read: 8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రకటనపై గుడ్‌న్యూస్, కనీస వేతనం ఎంత పెరగనుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.