Tomorrow Banks Holiday In These States: అధిక పని ఒత్తిడితో నీరసించి పోతున్న బ్యాంకు ఉద్యోగులకు భారీ శుభవార్త. ప్రణాళిక వేసుకోవాలే కానీ మూడు రోజులు సెలవులు వస్తాయి. ఒక రోజు మధ్యలో సెలవు పెడితే వరుసగా మూడు రోజులు ఏదైనా టూర్ ప్లాన్ చేసేయొచ్చు. బ్యాంకు ఉద్యోగులకు శుక్రవారం సెలవు వచ్చింది. సిక్కుల ఆధ్యాత్మిక గురువు గురు నానక్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు లభించింది. అయితే ఒకరోజు తర్వాత మళ్లీ ఆదివారం వచ్చింది. దీంతో సెలవులపరంగా కొంత కలిసి వస్తుండడంతో బ్యాంకు ఉద్యోగులు పండుగ చేసుకోవచ్చు. అయితే గురునానక్ జయంతి సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు లేదు. ఏయే రాష్ట్రాల్లో.. ఏయే బ్యాంకులకు సెలవు ఉందో తెలుసుకుందాం. గురునానక్ జయంతికి తోడు కార్తీక పౌర్ణమి కూడా ఉండడంతో సెలవు వచ్చింది.
Also Read: Narendra Modi: మరోసారి మన దేశంలో నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డు.. కమలం శ్రేణుల సంబరాలు..
బ్యాంకులన్నీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ రాష్ట్రాలవారీగా ప్రాంతీయ, జాతీయ సెలవులను ప్రకటిస్తుంది. జాతీయ సెలవులు అయితే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ప్రాంతీయ సెలవు అయితే ఆయా రాష్ట్రాల సంప్రదాయాలు, ప్రత్యేకతలు ఆధారంగా సెలవులు ఉంటాయి. ఈ సందర్భంగా గురునానక్ జయంతి జాతీయ సెలవు? ప్రాంతీయ సెలవు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కుల గురువు కావడంతో చాలా రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో సిక్కులు ఉన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు లభించింది.
Also Read: Modi - Nitish: బిహార్ సభలో అందరు చూస్తుండగానే నితీష్ చేసిన పనికి అవాక్కయిన ప్రధాని మోడీ..
గురునానక్ జయంతితోపాటు శుక్రవారం కార్తీక పౌర్ణమి ఉంది. కొన్ని ప్రాంతాల్లో రహస్ పూర్ణిమ అని కూడా అంటారు. సెలవు రోజు లభించడంతో సిక్కులు గురునానక్ జయంతిని చేసుకోనుండగా.. ఇతరులు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలను దర్శించుకోనున్నారు. దీపావళి తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమిని కూడా కొన్ని ప్రాంతాల్లో ఘనంగా చేసుకుంటారు. శివాలయాలను దర్శించుకుని సాయంత్రం పూట దీపాలు వెలిగించడం.. బాణాసంచా కాల్చడం చేస్తుంటారు.
ఈ రాష్ట్రాల్లో సెలవు
తెలంగాణ (హైదరాబాద్)తోపాటు మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగడ్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులకు సెలవు ఉంది. సిక్కులు అత్యధికంగా ఉండే పంజాబ్, ఢిల్లీలో కూడా బ్యాంకులకు శుక్రవారం సెలవు ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి