Jagga Reddy Comments:తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రగడ కొనసాగుతోంది. దేని ఆధారంగా చేసుకుని అధికార పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటీవల ఏపీలో వైసీపీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఇద్దరు తెలంగాణ వారే ఉన్నారు. ఇటు టీఆర్‌ఎస్ సైతం ముగ్గురి పేర్లను ప్రకటించింది. ఇందులోని వారంతా వ్యాపారవేత్తలే కావడంతో రాజకీయ దుమారం రేగింది. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం తెచ్చుకున్న ది ప్రజా సమస్యల పరిష్కారానికా..లేక బిజినెస్  చేసుకోవాడానికా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా పరిపాలన బదులు బిజినెస్‌ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తెలంగాణ విలువలను తగ్గిస్తోందన్నారు. 


హెటిరో పార్థసారధికి రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. గతంలో పార్థసారధి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని..రూ.500 కోట్లు బయట పడ్డాయని గుర్తు చేశారు. రాజ్యసభ సీట్లను తెలంగాణ అమరవీరులకు ఎందుకు కేటాయించలేదన్నారు. పార్థసారధి దగ్గర వేల కోట్లు ఉన్నాయని..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఉపయోగిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ ప్రభుత్వం..రైతును పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు..మోదీ హైదరాబాద్‌కు వస్తారు..ఇవేం రాజకీయాలన్నారు. గతంలో ఇందిరాగాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు అప్పటి సీఎం ఎన్టీఆర్ రిసీవ్ చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రధాని వచ్చే సమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు ఉండటం లేదని..దీనికి సమాధానం చెప్పాలన్నారు.


హర్యానా రైతుల దగ్గరకు సీఎం వెళ్తున్నారని..అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ రైతులను ఎవరూ పట్టించుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్,బీజేపీ,ఎంఐఎం ఒక్కటేనన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై బీజేపీ నేతలు పదేపదే మాట్లాడుతున్నారని..కేంద్రంలో వారిది ప్రభుత్వమే ఉంది కదా అని ప్రశ్నించారు. మొత్తంగా తెలుగురాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన చిచ్చురేపుతోంది.


Also read:Shani Jayanti 2022: 30 ఏళ్ల తర్వాత శనిజయంతి రోజు అద్భుతమైన యాదృచ్ఛికం!


Also read:TS Jobs Notifications: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త..తాజాగా మరో నోటిఫికేషన్‌..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook