Hyderabad Traffic Advisory: రేపు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో కొత్తగా నిర్మించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ భవనం, అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్స్‌ని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో రోడ్డు నెంబర్ 12 వైపు వచ్చే వాహనాల రాకపోకలపై ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"240283","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic-advisory-on-inauguration-of-hyderabad-police-commissionerate-and-integrated-command-control-center.jpg","field_file_image_title_text[und][0][value]":"ఆహ్వానం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic-advisory-on-inauguration-of-hyderabad-police-commissionerate-and-integrated-command-control-center.jpg","field_file_image_title_text[und][0][value]":"ఆహ్వానం"}},"link_text":false,"attributes":{"alt":"traffic-advisory-on-inauguration-of-hyderabad-police-commissionerate-and-integrated-command-control-center.jpg","title":"ఆహ్వానం","class":"media-element file-default","data-delta":"1"}}]]


హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ తెలిపిన సమాచారం మేరకు రేపు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వైపు వచ్చే వాహనాల రాకపోకలపై ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి.  


1) ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో హాస్పిటల్, ఫిలింనగర్ వైపు వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్డు నెంబర్ 36, రోడ్డు నెంబర్ 45 మీదుగా మాదాపూర్, సైబరాబాద్ మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.


2) మాసాబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1, రోడ్డు నెంబర్ 10, జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.


3) ఫిలింనగర్ నుంచి ఒరిస్సా ఐలాండ్ వైపు వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీయార్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది.


4) మాసాబ్‌ట్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 12 వైపు వచ్చే వాహనాలు మెహిదీపట్నం, నానల్ నగర్, టోలిచౌకి, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 


[[{"fid":"240284","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic-advisory-on-inauguration-of-hyderabad-police-commissionerate-and-police-towers-in-hyderabad.jpg","field_file_image_title_text[und][0][value]":"హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"traffic-advisory-on-inauguration-of-hyderabad-police-commissionerate-and-police-towers-in-hyderabad.jpg","field_file_image_title_text[und][0][value]":"హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు"}},"link_text":false,"attributes":{"alt":"traffic-advisory-on-inauguration-of-hyderabad-police-commissionerate-and-police-towers-in-hyderabad.jpg","title":"హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు","class":"media-element file-default","data-delta":"2"}}]]


హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో రోడ్డు నెంబర్ 12 వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ సిబ్బందికి సహకరించాల్సిందిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ నగర పౌరులకు విజ్ఞప్తి చేశారు.


Also Read : Big Debate With Bharath: బిగ్ డిబేట్ విత్ భరత్.. సంచలన విషయాలు వెల్లడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


Also Read : Komatireddy Rajagopal Reddy: అన్న వెంకట్ రెడ్డిపైనే రాజగోపాల్ రెడ్డి కుట్ర చేశారా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook