Big Debate With Bharath: బిగ్ డిబేట్ విత్ భరత్.. సంచలన విషయాలు వెల్లడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy Exclusive Interview: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా - మునుగోడు ఉప ఎన్నిక.. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల గురించి ఎవరి నోట విన్నా వినిపిస్తున్న ఏకైక హాట్ టాపిక్ ఇది. ఇంకా చెప్పాలంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించిన అంశం కూడా ఇదే.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2022, 10:18 PM IST
  • వాళ్ల కోసం సొంతంగా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన
  • నన్ను గెలిపించడమే మునుగోడు ప్రజలు చేసుకున్న పాపమా ?
  • సవాలక్ష యక్ష ప్రశ్నలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన సమాధానాలు.. మీ బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో..
Big Debate With Bharath: బిగ్ డిబేట్ విత్ భరత్.. సంచలన విషయాలు వెల్లడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy Exclusive Interview: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా - మునుగోడు ఉప ఎన్నిక.. తెలంగాణ రాజకీయాలను మరోసారి హీటెక్కించిన ఈ అంశంపై సవాలక్ష సందేహాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజంగానే మునుగోడు అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నారా ? లేక తన వ్యాపారాభివృద్ధి కోసం పార్టీ మారుతున్నారా అనే ప్రశ్నలే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తోన్న అంశమైతే.. అసలు బయటికి రాని విషయాల సంగతేంటి ? రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య లాంటిది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై అదే పార్టీకి చెందిన నేత రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ బయటకు రావడం ఆ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే అంశం. 

రాజగోపాల్ రెడ్డిని పార్టీలో అంతగా ఇబ్బందిపెట్టిన వ్యక్తులు ఎవరు ? ఏ పరిస్థితుల్లో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు ? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డికి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి ? బయట ప్రచారం జరుగుతున్నట్టుగానే రాజగోపాల్ రెడ్డి నిజంగానే కేంద్రం ఇచ్చే కాంట్రాక్టుల కోసం, ఈడి దాడుల నుంచి వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే బీజేపీలో చేరడానికి సిద్ధపడ్డారా ? ప్రస్తుతం అందరినీ ఆసక్తికి గురిచేస్తోన్న సందేహాలివి. 

ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జీ తెలుగు న్యూస్‌ ఎడిటర్ భరత్‌కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. బిగ్‌ డిబేట్‌ విత్‌ భరత్‌ షోలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పని ఎన్నో ప్రశ్నలకు జీ తెలుగు న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ విత్ భరత్ షోలో రాజగోపాల్ రెడ్డి సమాధానాలు చెప్పారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన సంచలన సమాధానాల కోసం 'బిగ్ డిబేట్ విత్ భరత్' తప్పక వీక్షించండి.

Also Read : Big debate with Bharath: ఈటల రాజేందర్‌కి సీఎం కేసీఆర్‌తో అక్కడే చెడిందా ? ఈటలతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Also Read : Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x