Hyderabad Traffic: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్‌ సెంటర్‌ను రేపు(గురువారం)సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేయబోతున్నారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మకంగా పోలీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలను పర్యవేక్షణ చేసేలా కంట్రోల్ రూమ్‌ను తయారు చేశారు. ఈసందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపు బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లో ట్రాఫిక్‌ నిబంధనలను అమలు చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. కంట్రోల్ సెంటర్ ప్రారంభం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అత్యంత రద్దీ ఉంటుందని దీనిని వాహనదారులు గమనించాలని తెలిపారు.


బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్ 12కు ఉదయం 11 గంటల  నుంచి సాయంత్రం 5 గంటలకు వాహనదారులు రావొద్దని..ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ భవన్, అపోలో హాస్పిటల్, ఫిల్మ్‌ నగర్, బంజారాహిల్స్‌ వైపు వచ్చే వాహనదారులు..ప్రత్యామ్నాయ మార్గంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 36, రోడ్డు నెంబర్ 45 నుంచి మాదాపూర్, సైబరాబాద్ వైపు వెళ్లాలని వెల్లడించారు. 


మాసబ్‌ ట్యాంక్‌ నుంచి రోడ్‌ నెంబర్ 12, బంజారాహిల్స్‌ వైపు నుంచి వచ్చే వారంతా రోడ్ నెంబర్ 1, బంజారాహిల్స్, రోడ్‌ నెంబర్ 10, జహీరా నగర్, క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లాలని తెలిపారు. ఫిల్మ్ నగర్ నుంచి ఒడిశా దీపం వైపు నుంచి వచ్చే వాహనదారులంతా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సోసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.


మాసబ్ ట్యాంక్‌ నుంచి రోడ్ నెంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వారంతా మెహిదీపట్నం, నానల్ నగర్, టోలిచౌకి, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్‌ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లొచ్చని తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలకు నగరవాసులంతా సహకరించాలని పిలుపునిచ్చారు.


[[{"fid":"240180","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:Kcr vs Governer: కేసీఆర్ సర్కార్ వర్సెస్ రాజభవన్.. జాతీయ జెండాల పంపిణీలో పోటాపోటీ  


Also read:ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook