హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే రెండు కోచ్ లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణీకులు వెంటనే ట్రెయిన్ దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బోగీల్లో మంటలు అంటుకున్న విషయాన్ని స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఐతే వారు వచ్చేలోగానే  భారీ మంటల కారణంగా  ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. మరో బోగీకి అంటుకున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. కానీ వారికి మంటలు ఆర్పేందుకు దాదాపు అరగంట పాటు శ్రమించాల్సి వచ్చింది. 


[[{"fid":"183141","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Read Also: drama juniors5: డ్రామా జూనియర్స్ ప్రోమో అదుర్స్


మంటలు ఎలా అంటుకున్నాయి...? షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా..? లేదా ఎవరైనా స్టవ్ లాంటి వస్తువులు ఏమైనా తీసుకొచ్చారా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు రెండు బోగీల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Read Also: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..