Bandi Sanjay on Secunderabad Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసకాండ వెనక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.ఈ మూడు పార్టీలు చేసిన కుట్రలో భాగంగానే అల్లర్లు జరిగాయన్నారు. రైల్వే స్టేషన్‌ లోపలికి అంతమంది ఆందోళనకారులు చొచ్చుకెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.. ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేసిన దాడి అని... నిరసనకారులు ముసుగులు వేసుకుని వచ్చి మరీ దాడులకు పాల్పడ్డారని సంజయ్ ఆరోపించారు. అందుకే తెలంగాణలోనూ బుల్డోజర్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌తో అభ్యర్థులకు అన్యాయం జరగదని... వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు గొప్పవారని... వాళ్లిలా చేస్తారని తాను భావించట్లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసాన్ని ప్రోత్సహిస్తోందన్నారు సంయ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. సికింద్రాబాద్ అల్లర్లు పూర్తిగా ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగాయన్నారు.


కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి శుక్రవారం (జూన్ 17) ఉదయం భారీ ఎత్తున ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. మొదట పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పలు రైళ్లకు నిప్పంటించారు. పార్శిల్ లగేజీలను పట్టాలపై వేసి తగలబెట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోగా.. వారి పైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. గాయపడినవారు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


Read Also: Secunderabad Violence: అప్పుడు రైతులతో, ఇప్పుడు జవాన్లతో కేంద్రం చెలగాటం.. సికింద్రాబాద్ ఘటనపై కేటీఆర్ రియాక్షన్.. 


Read Also: Agnipath Protest: దేశంలో అగ్నిపథ్‌ జ్వాలలు..చేయి దాటిపోతున్న పరిస్థితి..!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.