Minister KTR Reaction over Secunderabad Violence: త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' స్కీమ్ యువతలో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తోంది. గురువారం (జూన్ 16) బీహార్, రాజస్తాన్‌లలో చెలరేగిన ఉద్రిక్తతలు శుక్రవారం దక్షిణాదికి కూడా పాకాయి. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పలు రైళ్లకు నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డారు. హింసను అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. మొత్తంగా సికింద్రాబాద్‌లో అల్లకల్లోల పరిస్థితులులు నెలకొన్నాయి. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న హింసాత్మక నిరసన ఘటనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభానికి కచ్చితమైన సూచిక.. ఒక కనువిప్పు. మొదట దేశ రైతులతో చెలగాటమాడారు. ఇప్పుడు దేశ జవాన్లతో చెలగాటమాడుతున్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు నో ర్యాంక్ నో పెన్షన్ విధానాన్ని ప్రతిపాదించారు.' అంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కేంద్రంపై పరోక్షంగా ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అనూహ్య విధ్వంసకాండ యువతలో నెలకొన్న ఆగ్రహాన్ని ప్రతిబింబించింది. అగ్నిపథ్ ద్వారా కేవలం నాలుగేళ్ల కాల పరిమితితో రిక్రూట్‌మెంట్స్ జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా త్రివిధ దళాల్లో చేరేవారిని అగ్నివీర్ అని పిలుస్తారు. వీరిలో కేవలం 25 శాతం మంది మాత్రమే ఆ తర్వాత రెగ్యులరైజ్ అవుతారు. మిగతా 75 శాతం మంది ఎగ్జిట్ అవుతారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఎగ్జిట్ అయ్యేవారికి ఎటువంటి ఫించన్ సదుపాయం ఉండదు. అయితే సర్వీస్ తర్వాత సుమారు రూ.12 లక్షల ప్యాకేజీ అందిస్తారు. రాష్ట్రాల పరిధిలో జరిగే పోలీస్ రిక్రూట్‌మెంట్లలోనూ వీరికి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. అయితే యువత మాత్రం ఈ నిర్ణయం ద్వారా తాము చాలా నష్టపోతామని.. అగ్నివీర్‌గా నాలుగేళ్ల సర్వీస్ తర్వాత తమ భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
The violent protests against #AgniveerScheme is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country
Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़
From One Rank - One Pension to proposed No Rank - No Pension!
— KTR (@KTRTRS) June 17, 2022
Also Read: Secunderabad Agnipath Protests: రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ!
Also Read: Sai Pallavi Virata Parvam Twitter Review: 'విరాటపర్వం' ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.