VINOD KUMAR: భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో  సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. సంజయ్ ఆరోపణలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేతలు. భద్రాద్రి ప్రాజెక్టుకు సంబంధించి సంజయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండానే సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టును టెండర్ ద్వారా బీహెడ్ఇఎల్ దక్కించుకుందని తెలిపారు. BHEL ఎవరి పరిధిలో ఉందో సంజయ్ తెలుసుకోవాలన్నారు వినోద్ కుమార్. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య జరిగిన డీల్ లో కుంభకోణం ఉంటుందా? అని వినోద్ కుమార్ అడిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్రాద్రికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని BHEL సంస్థ ఇచ్చిన యంత్రాలే వాడుతున్నారని చెప్పారు వినోద్ కుమార్.  BHEL ఇచ్చిన సామగ్రి తుప్పుపట్టిన యంత్రాలని సంజయ్ చెబుతున్నారా అని నిలదీశారు.సంజయ్ ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్, మోడీకి పైసలు ఇచ్చినట్లు ఉన్నాయన్నారు. అంబానీ, అదాని వచ్చినా కేసీఆర్ వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారని తెలిపారు. NTPCకి 7 రూపాయలు ఇచ్చి కరెంట్ కొంటున్నామని అంటే  కేసీఆర్ ntpc కి పైసలు ఇస్తున్నట్లా అని సంజయ్ ని ప్రశ్నించారు వినోద్ కుమార్. బండి సంజయ్ మాటలు తుగ్లక్ కంటే దారుణంగా ఉన్నాయని విమర్శించారు. సంజయ్ తన ఆరోపణలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వం షేర్ హోల్డర్ గా ఉందన్నారు వినోద్ కుమార్.  రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ లో తెలంగాణ ప్రభుత్వానికి ఈక్విటీ ఉందన్నారు. కేసీఆర్ లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి ఉండేదన్నారు.


దేశంలో అన్ని రాష్ట్రాల అప్పులు తీసుకుంటాన్నాయని వినోద్ కుమార్ అన్నారు. తీసుకున్న అప్పును సరిగ్గా చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. FRBM నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వమే వ్యవహరిస్తోందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. జీతాలకు- అప్పులకు సంబంధం లేదన్నారు వినోద్ కుమార్. కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికేనని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని భట్టి అప్పులు వస్తాయి...కానీ కేంద్రం కావాలనే అడ్డు పడుతోందని విమర్శించారు. 8 ఏళ్లలో కేంద్రం వంద లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు కాని తెలంగాణ రాష్ట్రం చేయకూడదా అని నిలదీశారు. కేంద్రం వంద లక్షల కోట్లు ఎందుకోసం చేసిందో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుతుంటే..కేంద్రం అమ్ముతోందని వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు.


READ ALSO:Osmania Hospital: శవాలపై పేలాలు అమ్ముకునే రకం.. వెయ్యి ఇస్తేనే మార్చురీకి మృతదేహం!


READ ALSO: Theft in KVP House: కాంగ్రెస్ నేత కేవీపీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ... పోలీసులకు ఫిర్యాదు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook