Trs Mla Warning: పరకాలకు వస్తే చెప్పు దెబ్బలే! రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్..
Trs Mla Warning To Revanth Reddy: హన్మకొండ జిల్లాలోని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో అక్కంపేట నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు.రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత కామెంట్లు చేశారు.
Trs Mla Warning To Revanth Reddy: హన్మకొండ జిల్లాలోని దివంగత ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో అక్కంపేట నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. జయశంకర్ సార్ గ్రామాన్ని కేసీఆర్ సర్కార్ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అక్కంపేట నుంచే కేసీఆర్ పతనం మొదలైందని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. జయశంకర్ సొంతూరులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత కామెంట్లు చేశారు. పార్టీ ఉనికి కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి జోకర్ మాటలు మాట్లాడారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జయశంకర్ సార్ గురించి రేవంత్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్ లు జొడెడ్లలాగా పనిచేశారని చెప్పారు.
ఉద్యమ సమయంలో చంద్రబాబు స్క్రిప్ట్ లోరేవంత్ రెడ్డి పాత్రదారుడిగా ఉన్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. జయశంకర్ సార్ ను స్మరించుకోవడానికే జిల్లాకు పేరు పెట్టామని తెలిపారు.తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీల ప్రత్యామ్నాయం కోసమే అనేక రాష్ట్రాలు కేసిఆర్ ను కోరుకుంటున్నాయని వినయ్ భాస్కర్ అన్నారు.
రైతు ఉద్యమంలో అమరులైన వారిని ఆదుకుంటే కాంగ్రెస్, బీజేపీ లకు భయమెందుకని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ ను ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ లా ప్రవర్తించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జయశంకర్ సార్ స్వగ్రామానికి వచ్చి చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు.రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య రచ్చ జరిగిందన్నారు ధర్మారెడ్డి. రైతు డిక్లరేషన్ 6 ఏండ్ల క్రితమే కేసిఆర్ తీసుకొచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేశామని తెలిపారు. ఆపద్బంధు పథకంతో కాంగ్రెస్ రైతులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. 5 లక్షల రైతు బీమా 10 రోజుల్లో అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలిత రైతులు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. అక్కంపేట రచ్చబండలో అసలు రైతులే లేరన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏ గ్రామానికి వచ్చినా రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. కొడంగల్ కి వస్తా... నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించూ రేవంత్ రెడ్డి అంటూ సవాల్ చేశారు.
READ ALSO:KCR Delhi Tour: అమిత్ షా, రాహుల్ పొలిటికల్ టూరిస్టులు అయితే కేసీఆర్ ఎవరూ? సోషల్ మీడియాలో రచ్చ..
READ ALSO: Bandi Sanjay: తెలంగాణలో రూ. 80కే లీటర్ పెట్రోల్! ఏం చేయాలో చెప్పిన బండి సంజయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook