KCR Delhi Tour: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి. కొన్ని రోజులుగా అన్ని పార్టీలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే.. విపక్షాలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. సంజయ్ పాదయాత్రకు మద్దతుగా బీజేపీ జాతీయ నేతలు తరలివచ్చారు. పాలమూరు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాగా.. తుక్కుగూడలో జరిగిన ముగింపు బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. తెలంగాణ పీసీసీ కూడా రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తోంది. వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే విపక్ష పార్టీ కార్యక్రమాలపై టీఆర్ఎస్ నేతలు కౌంటరిచ్చారు.
తెలంగాణలో అమిత్ షా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ పర్యటనపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జాతీయ నేతనలు ఏకంగా టూరిస్టులతో పోల్చుతూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు రోజుకో టూరిస్ట్ వస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. టూరిస్టులు వస్తారు.. పోతారు.. కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజలకు లోకల్ అని ఆయన కామెంట్ చేశారు. ఇక మంత్రి హరీష్ రావు ప్రపంచ వసల పక్షుల దినోత్సవం పేరుతో అమిత్ షా పర్యటనపై సెటైర్లు వేశారు. వలస పక్షులు తమ ఇష్టమైన ప్రదేశానికి వస్తాయి.. కావాల్సినవి తిని తిరిగి వెళ్లిపోతాయంటూ ఆయన తన ట్వీట్ లో చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే టూరిస్టులు వచ్చి తెలంగాణ రాష్ట్రానిక ట్యాక్స్ కట్టి వెళుతున్నారంటూ విమర్శలు చేశారు. ఇతర టీఆర్ఎస్ మంత్రులు కూడా జాతీయ నేతలను పర్యాటకులతో పోల్చుతూ తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలను కార్నర్ చేస్తూ కేటీఆర్, హరీష్ రావులు వాడిన టూరిస్ట్ పదమే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. జాతీయ పర్యటనలో భాగంగా ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఎస్పీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ తోనూ మంతనాలు సాగించారు. అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడానికి పంజాబ్ వెళ్లారు. ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్నారు కేసీఆర్. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. తర్వాత మహారాష్ట్ర, కోల్ కతా వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ జరుపుతున్న పర్యటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు కేసీఆర్ వెళ్లడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన జాతీయ నేతలను టూరిస్టులతో పోల్చుతూ టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. సీఎం కేసీఆర్ పై మండిపడుతున్నారు కాంగ్రెస్, బీజేపీ ఫాలోవర్స్. కేంద్రమంత్రిగా ఉన్న అమిత్ షా హైదరాబాద్ కు టూరిస్ట్ అయితే.. ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ ఎవరని కొందరు ప్రశ్నిస్తున్నారు. వలస పక్షిగానే కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారా అని నిలదీస్తున్నారు. టూరిస్ట్ అన్న పదానికి ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు అర్ధం చెప్పాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలను విమర్శించే ముందు వెనకా ముందు చూసుకుంటే మంచిదని మరికొందరు సూచిస్తున్నారు. మొత్తంగా గతంలో టీఆర్ఎస్ నేతలు చేసిన టూరిస్ట్ కామెంట్లే.. ఇప్పుడు కేసీఆర్ కు ఇబ్బందిగా మారడం ఆసక్తికరం.
READ ALSO: Bandi Sanjay: తెలంగాణలో రూ. 80కే లీటర్ పెట్రోల్! ఏం చేయాలో చెప్పిన బండి సంజయ్..
READ ALSO: KGF Chapter 2 Update: హోరెత్తిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 కలెక్షన్లు, రాకీభాయ్ మోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook