హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకు అన్నివర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కేటీఆర్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. కేసీఆర్ తన మేనల్లుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని విస్మరించి కొడుక్కి పార్టీ పగ్గాలు అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నరని రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. అయితే, ఆ అభిప్రాయాలన్నీ కేవలం అపోహలు మాత్రమే నిజానికి తప్ప తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని నిరూపిస్తూ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు కేటీఆర్‌‌కు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు తన నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హరీష్‌‌ ట్వీట్‌ పేర్కొన్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, హరీష్ రావు ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన కేటీఆర్‌..‌ థ్యాంక్స్‌ బావా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత కేటీఆర్ మర్యాదపూర్వకంగా హరీష్‌రావు ఇంటికెళ్లి ఆయనను కలుసుకుని తామంతా ఒక్కటేనని తమ ప్రత్యర్థులకు సందేశం ఇచ్చారు.