TRS Medak MLA Padma Devender Reddy tests Covid Positive: తెలంగాణలో కోవిడ్ విజృభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్‌‌ఎస్‌ మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి (TRS Medak MLA Padma Devender Reddy) కోవిడ్ పాజిటివ్‌గా (Covid positive) తేలింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో పద్మాదేవేందర్‌ రెడ్డి (Padma Devender Reddy) ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో (Home‌Isolation‌) ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల తమతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలంటూ పద్మా దేవేందర్‌ కోరారు. ఇక మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్‌ (Omicron) వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు కూడా రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు (Omicron cases) మరింత పెరిగే అవకాశం ఉందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో (Telangana) సుమారు ముప్పై శాతం జనాభాకు వైరస్‌ సోకే అవకాశాలు ఉన్నాయంటూ వైద్యాఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.


సంక్రాంతి తర్వాత కోవిడ్ కేసులు (Covid cases) మరింత పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు టీఎస్ సర్కార్ సన్నద్ధం అవుతోంది. ఒకవేళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగితే అందుకు తగ్గట్లుగా హాస్పిటల్స్‌ను (Hospitals‌) కూడా సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.


Also Read : New ISRO Chief: ఇస్రో ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియామకం


ఇప్పటికే వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది ప్రభుత్వం. ఆదివారం కూడా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్‌ టెస్ట్‌లు తగ్గకుండా చూడాలంటూ వైద్యాఆరోగ్య శాఖను టీఎస్ సర్కార్ (TS Sarkar) ఆదేశించింది. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు కోవిడ్ (Covid) నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది.


Also Read : తెలంగాణ రైతులు సంబరపడే న్యూస్.. ప్రతీ నెలా ఫించన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ సర్కార్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook