TS Corona Update: తెలంగాణలో కొత్తగా 2,319 కరోనా కేసులు, ఇద్దరు మృతి

Covid-19: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 2,319 కేసులు వచ్చాయి. వైరస్ తో ఇద్దరు మృతి చెందారు.   

Last Updated : Jan 12, 2022, 08:27 PM IST
  • తెలంగాణలో కరోనా కల్లోలం
  • కొత్తగా 2,319 మందికి వైరస్ నిర్ధారణ
  • వైరస్ తో ఇద్దరు మృతి
TS Corona Update: తెలంగాణలో కొత్తగా 2,319 కరోనా కేసులు, ఇద్దరు మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 90,021 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,319 మందికి కరోనా పాజిటివ్ (Corona cases in Telangana) గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,00,094కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 

రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,047కి చేరింది. కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,339 యాక్టివ్‌ కేసులు (Active Cases in Telangana) ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,275 కేసులు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం విశేషం. రాష్ట్రంలో ఇవాళ 2.51 లక్షల మందికి కొవిడ్ టీకాలు అందించారు. 36,691 మందికి కొవిడ్‌ బూస్టర్ డోసులు వేశారు.

Also Read: Telangana Corona Update: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కొవిడ్‌ కేసులు నమోదు!

దేశంలో కరోనా​ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రెండు లక్షలకు చేరువగా కరోనా కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. 1,94,720 మంది కొత్తగా కరోనా బారిన పడగా.. 442 మంది కొవిడ్ మహమ్మారి ధాటికి మరణించారు. మరోవైపు 60,405  మంది వైరస్​ జయించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News