Pilot Rohith Reddy Audio Leak: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామచంద్రభారతి స్వామితో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడిన కాల్ రికార్డింగ్ లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేస్తానంటూ రోహిత్ రెడ్డితో స్వామిజీ చెప్పినట్లు ఆడియోలో ఉంది. ఎమ్మెల్యేల వ్యవహారంపై హైదరాబాద్‌లో చర్చిద్దామని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీలోకి రావడానికి తాను క్లియర్ చేస్తానాన్న స్వామీజీ.. బీజేపీలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. 


తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని చెప్పిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఈ వ్యవహరంపై హైదరాబాద్‌లో చర్చిద్దామన్నారు. అయితే  హైదరాబాద్‌లో కాకుండా వేరే రాష్ట్రంలో చర్చిద్దామని స్వామీజీ చెప్పగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సేఫ్ ప్లేస్ అని రోహిత్ రెడ్డి చెప్పారు. నవంబర్ 25 తర్వాత తాను హైదరాబాద్‌కు వస్తానని.. అప్పుడు మాట్లాకుందామని రామచంద్ర భారతీ ఆడియోలో అన్నారు.


తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని.. అయితే వారి పేర్లను హైదరాబాద్‌లో కలిసిన తరువాత చెప్తానని రోహిత్ రెడ్డి చెప్పారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నందకుమార్‌పై ఒత్తిడి పెట్టామని.. అందుకే రోజు కాల్స్‌ చేస్తున్నామని రామచంద్ర భారతీ చెప్పారు. అయితే ఈ విషయం ఎక్కడా కూడా బయటకు రాకుండా చూసుకోవాలని.. వస్తే తమ ప్రాణాలే పోతాయని రోహిత్ రెడ్డి ఆడియోలో చెప్పినట్లు ఉంది. ఈ విషయంలో ఆందోళన పడొద్దని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్వామీజీ చెప్పారు. అవసరమైతే కేంద్రం నుంచి ప్రత్యేక బలగాలతో రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
 
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బీఎల్ సంతోష్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటారని స్వామీజీ ఆడియోలో అన్నారు. ఆయన వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతారని.. బీజేపీ నెంబర్ 1, 2లతో దగ్గరకు వెళదామన్నారు. అయితే ఒకరిద్దరు ముందుగా వస్తే బాగుంటుందని.. నవంబర్ 25 తరువాత కలుద్దామని రోహిత్ రెడ్డితో చెప్పినట్లు ఆడియోలో ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ తెలంగాణలో సంచలనంగా మారింది. 


Also Read: బీజేపీ మహిళా నేతలు ఐటెమ్స్... ఖుష్బూ పెద్ద ఐటెం.. అధికార పార్టీ నేత దారుణ వ్యాఖ్యలు!


Also Read: Telangana: కస్తూర్బా పాఠశాల భోజనంలో బల్లి.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook